Movie News

బిగ్ డే : భారతీయుడుకి భారీ పరీక్ష

కల్కి 2898 ఏడి వచ్చిన రెండు వారాలకు భారతీయుడు 2 థియేటర్లలో అడుగుపెడుతున్నాడు. ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతాన్ని చూసేసిన మూవీ లవర్స్ ఇప్పుడు శంకర్ ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ముహూర్తం రానే వచ్చింది. అంచనాలు మరీ విపరీతంగా లేకపోయినా తెలుగునాట కమల్ హాసన్ కున్న ఇమేజ్, భారతీయుడు బ్రాండ్ రెండు పని చేశాయి. అది అడ్వాన్స్ బుకింగ్స్ లోనే స్పష్టమవుతోంది. ఒక్క హైదరాబాద్ లోనే మొదటి షో పడక ముందే రెండు కోట్ల గ్రాస్ దాటినట్టు ట్రేడ్ టాక్. మిగిలిన చోట ఇంత దూకుడుగా లేకపోయినా రెస్పాన్స్ బాగుంది.

ఇక భారతీయుడు 2 టాక్ ఎలా వస్తుందనేది కీలకంగా మారనుంది. మూడో భాగం షూటింగ్ చేసేశారు కాబట్టి ఈ సెకండ్ పార్ట్ సక్సెస్ మీదే దాని బిజినెస్ ఆధారపడి ఉంటుంది. శంకర్ కు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఉంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఎలా ఉండబోతోందనే దాని మీద ఇండియన్ 2ని ఒక శాంపిల్ లా భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఒకే ఒక్కడు రేంజ్ లో దాన్ని ఊహించుకుంటున్న అభిమానులు ఇప్పుడీ భారతీయుడు 2 శంకర్ ఎలా తీర్చిదిద్దాడనే దాని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మొదటి రోజే చూసేయడం ద్వారా సపోర్ట్ కూడా చేస్తున్నారు.

విక్రమ్ నుంచి తన మార్కెట్ ని తిరిగి నిలబెట్టుకున్న కమల్ హాసన్ కు విజయం దక్కడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న ఇతర సినిమాల వ్యాపారం పెరగాలన్నా తగ్గాలన్నా భారతీయుడు మీదే ఆధారపడి ఉంటుంది. యుఎస్ ప్రీమియర్ టాక్స్ మెల్లగా వస్తున్నాయి కానీ ఇంకొంత సమయం వేచి ఉంటె అసలైన లోకల్ తెలుగు తమిళ స్పందన బయటికి వస్తుంది. అప్పటిదాకా కొంత ఎదురు చూడాల్సిందే. సిద్దార్థ్ పాత్ర, అనిరుద్ రవిచందర్ సంగీతం, భారీ క్యాస్టింగ్, లైకా నిర్మాణ విలువలు ప్రధాన ఆకర్షణలుగా వచ్చిన భారతీయుడు జాతకం మరికాసేపట్లో తేలనుంది. చూద్దాం.

This post was last modified on July 12, 2024 6:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

12 minutes ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

6 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

8 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

9 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

11 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

12 hours ago