ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న తమిళ అనువాద చిత్రం ‘భారతీయుడు-2’కు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడం చర్చనీయాంశం అవుతోంది. కమల్ హాసన్, శంకర్‌లకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవం. ‘భారతీయుడు’ లాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ కాబట్టి ‘భారతీయుడు-2’ మీద ప్రేక్షకుల్లో అంచనాలుంటాయన్నది వాస్తవం. కానీ ఎంతైనా ఇది ఒక డబ్బింగ్ మూవీ అనే విషయం మరిచిపోకూడదు.
తెలుగు సినిమా కాదు. పర భాష నుంచి వచ్చిన చిత్రానికి కూడా రేట్లు పెంచాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న పాయింట్. ఇక్కడ ప్రస్తావించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. ఇండియన్-2 ఒరిజినల్‌గా తెరకెక్కింది తమిళంలో అయితే.. తమిళనాట ఆ సినిమాకు పెట్టిన రేట్లతో పోలిస్తే తెలంగాణలో 80 శాతం అధిక ధరలు ఉన్నాయి.
తమిళనాట మల్టీప్లెక్సుల్లో కూడా టికెట్ ధర రూ.190 మాత్రమే. నార్మల్ సింగిల్ స్క్రీన్లలో రేటు రూ.150. ప్రీమియం సింగిల్ స్క్రీన్లలో మల్టీప్లెక్సులతో సమానంగా ధర ఉంది. అక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాదిరి పెద్ద సినిమాలకు రేటు పెంచుకునే సంప్రదాయం లేదు. నార్మల్ రేట్లతోనే రిలీజ్ చేస్తారు. ‘ఇండియన్-2’ భారీ బడ్జెట్ మూవీ అయినా రూ.190, రూ.150 రేట్లతోనే రిలీజవుతోంది. కానీ తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో రూ.350, సింగిల్ స్క్రీన్లలో రూ.225 రేటుతో చూడాల్సిన పరిస్థితి.
మామూలుగానే ఇక్కడ తమిళనాడుతో పోలిస్తే రేట్లు ఎక్కువ. మల్టీప్లెక్సుల్లో రూ.295, సింగిల్ స్క్రీన్లలో 175 పెట్టాలి. అవే ఎక్కువ రేట్లు అంటే.. వాటి మీద అదనపు రేట్లు ఇచ్చారు. ఒక తమిళ సినిమాను తమిళులు రూ.200 లోపు రేటుతో చూస్తుంటే మనం మాత్రం రూ.350 పెట్టాల్సి రావడం విడ్డూరం. మన ప్రేక్షకుల సినిమా పిచ్చిన క్యాష్ చేసుకోవడం కాక ఇది మరేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
This post was last modified on July 11, 2024 6:21 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…