Movie News

‘వి’ దెబ్బకు ‘నిశ్శబ్దం’కు డెఫిషిట్

తెలుగులో థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీ రిలీజ్‌కు వెళ్లిన వాటిలో అత్యంత పెద్ద సినిమా అంటే.. ‘వి’నే. ఆ సినిమాపై ఇటు సినీ పరిశ్రమ, అటు ప్రేక్షకులు చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ చిత్రం మీద అమేజాన్ ప్రైమ్ ఏకంగా రూ.32 కోట్ల పెట్టుబడి పెట్టడం గమనార్హం.

బడ్జెట్ మీద మంచి లాభానికే దిల్ రాజు ఈ సినిమాను అమ్ముకున్నాడు. ఇతర హక్కులు కూడా కలిపితే రాజుకు రూ.10 కోట్ల దాకా లాభం దక్కినట్లు సమాచారం. ఐతే ‘వి’ మీద పెట్టిన పెట్టుబడికి తగ్గ ప్రయోజనం అమేజాన్‌ వాళ్లకు దక్కలేదు. దీంతో ఇకపై కొత్త సినిమాలను కొనే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ప్రైమ్ వాళ్లు డిసైడయ్యారు. ఈ ప్రభావం ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న కొత్త సినిమాలపై పడింది.

‘వి’ తర్వాత రిలీజవుతున్న మరో పెద్ద సినిమా ‘నిశ్శబ్దం’కు మొదట్లో ఆఫర్ చేసిన రేటు రూ.30 కోట్ల పైనే కాగా.. ఇప్పుడు రూ.24 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ.30 కోట్ల దాకా అయింది. ఇంతకుముందు పెట్టుబడి మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌తోనే వచ్చేసేది. కానీ ఆలస్యం చేయడం వల్ల, ‘వి’ ప్రభావం కూడా పడి రూ.24 కోట్లే ముట్టాయి. అంటే రూ..6 కోట్ల డెఫిషిట్‌తో సినిమాను రిలీజ్ చేస్తున్నారన్నమాట. సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నదాన్ని బట్టి శాటిలైట్, డబ్బింగ్, ఇతర హక్కులతో ఆ లోటును పూడ్చుకోవాల్సి ఉంటుంది.

ఈ సినిమాకు సరైన స్పందన లేకుంటే మున్ముందు రిలీజయ్యే కొత్త చిత్రాలపైనా ఆ ప్రభావం పడుతుంది. సోలో బ్రతుకే సో బెటర్, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా లాంటి చిత్రాలు డిజిటల్ రిలీజ్ కోసం లైన్లో ఉన్నాయి. వాటికి ఇంకా డీల్స్ పూర్తి కాలేదు. ‘నిశ్శబ్దం’తో పాటు అక్టోబరు 2న ఒరేయ్ బుజ్జిగా రిలీజవుతుండగా.. 23న ‘కలర్ ఫొటో’ విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on September 24, 2020 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago