పవన్ కళ్యాణ్ తన సోల్ మేట్ అంటూ ఒకప్పుడు పవర్ స్టార్ గురించి సందర్భం వచ్చినపుడల్లా గొప్పగా మాట్లాడేవాడు స్టార్ రైటర్ కోన వెంకట్. ఇలా పవన్ తనకు ఆప్త మిత్రుడని చెప్పుకోవడం ద్వారా పవర్ స్టార్ అభిమానుల్లో కూడా ఆదరణ దక్కించుకున్నాడు. కానీ 2019 ఎన్నికల ముంగిట పవన్ ఫ్యాన్స్‌కు పెద్ద షాకిస్తూ వైసీపీలో చేరడమే కాదు.. పవన్ మీద తీవ్ర విమర్శలు చేయడం ద్వారా వారికి పెద్ద శత్రువుగా మారిపోయాడు. సోల్ మేట్ అని చెప్పుకుంటూ ఇలా యుటర్న్ తీసుకోవడం.. పైగా పవన్ మీద తీవ్ర విమర్శలు చేయడం అభిమానులకు అస్సలు నచ్చలేదు. దీంతో అప్పట్నుంచి కోనను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
ఇటీవలి ఎన్నికల ముంగిట వైసీపీ ప్రభుత్వానికి ఎలివేషన్ ట్వీట్లు వేస్తే పవన్ ఫ్యాన్సే కాదు.. న్యూట్రల్ జనాలు కూడా కోనకు మామూలుగా రిప్లైలు ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కామెంట్ కనిపించకపోవడంతోనే కోనకు పరిస్థితి అర్థమైపోయి ఉండాలి.
ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. ఐతే ఫలితాలు రాగానే కోన మళ్లీ యుటర్న్ తీసుకున్నట్లే కనిపిస్తున్నాడు. పవన్ గురించి వరుసగా పాజిటివ్‌గా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఐతే గెలిచినపుడు మొక్కుబడిగా ఒక ట్వీట్ వేయడం ఓకే కానీ.. వరుసగా జనసేనానికి ఎలివేషన్లు ఇస్తుండడం గమనార్హం. పవన్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఇది చాలా ముఖ్యమైన రోజని, దీని కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ట్వీట్ చేశాడు కోన.
తాజాగా పవన్ మంత్రిగా చేసిన మంచి పనులను కొనియాడుతూ ట్వీట్ వేశాడు. చేతి వృత్తులకు పవన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రశంసించాడు. ఆ ట్వీట్లలో పవన్‌ను కొనియాడుతున్న తీరు చూస్తుంటే వైసీపీకి ఆయన టాటా చెప్పేసి మళ్లీ పవన్ భక్తుడిగా మారిపోయాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కానీ జనసైనికులు మాత్రం ఇప్పుడిప్పుడే కోనను మన్నించేలా లేరు. వారి ఆగ్రహం ఆ స్థాయిలో ఉంది కాబట్టే.. కామెంట్ బాక్స్ క్లోజ్ చేసుకుని ట్వీట్లు వేస్తున్నాడు కోన. తాను పూర్తిగా మారిపోయానని పవన్ ఫ్యాన్స్ భావించి తన మీద దాడి ఆపితే తప్ప ఆయన కామెంట్ బాక్స్ ఓపెన్ చేసేలా లేరు.
This post was last modified on July 10, 2024 3:23 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…