యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్ననే అయినప్పటికీ కేవలం సెకండ్ హాఫ్ లో కనిపించే త్రిప్తి డిమ్రినే యువత మనసులు కొల్లగొట్టిందన్నది వాస్తవం. ముఖ్యంగా రన్బీర్ కపూర్ తో చేసిన ఒక బోల్డ్ సీన్ తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అప్పటిదాకా అవకాశాలు పెద్దగా లేక అనామకంగా ఉండిపోయిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఒక్కసారిగా బిజీ అయిపోయింది. హిందీలోనే బోలెడు ఆఫర్లు వస్తుండగా మన సౌత్ దర్శకులు కూడా ఈమె కాంబో కోసం ట్రై చేస్తున్నారు. తను నటించిన కొత్త మూవీ బ్యాడ్ న్యూజ్ ఈ నెల 19 విడుదలకు రెడీ అవుతోంది. ప్రత్యేకంగా దీని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చూద్దాం.
బ్యాడ్ న్యూజ్ కథే విచిత్రంగా ఉంటుంది. ఓ అమ్మాయి గర్భం దాలుస్తుంది. కానీ తండ్రి ఎవరో అంతుచిక్కని అయోమయం నెలకొంటుంది. ఎందుకంటే ఒక రాత్రి ఆమె ఇద్దరితో గడిపే సందర్భం వచ్చి ఉంటుంది కాబట్టి. ఒకడేమో మాజీ ప్రియుడు ఇంకోడు ప్రెజెంట్ లవర్. ఫాదర్ ఎవరో నిర్ణయించాలంటే వీళ్ళ సత్తా ఋజువు కావాలని విచిత్రమైన పరీక్షలు పెడతారు. వాళ్ళలో ఎవరు గెలిచి జనకుడు బిరుదు అందుకున్నారో అదే స్టోరీ అన్న మాట. పాయింట్ వినగానే మైండ్ పోతోంది కదూ. ఇక్కడితో అయిపోలేదు. హీరో విక్కీ కౌశల్ తో త్రిప్తి డిమ్రి నటించిన బోల్డ్ సీన్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.
తను అంగీకారం తెలుపుతోంది కాబట్టి దర్శకులు అలాంటి సీన్లు, సబ్జెక్టులు రాస్తున్నారేమో కానీ త్రిప్తి డిమ్రి మాత్రం మొహమాటం లేకుండా ఎక్స్ పోజింగ్ కి ఎస్ అనేస్తోంది. హోమ్లీ హీరోగా పేరున్న విక్కీ కౌశల్ సైతం ఈ బ్యాడ్ న్యూజ్ కోసం బ్యాడ్ బాయ్ గా మారిపోవడం విశేషం. కల్కి 2898 ఏడి తప్ప దానికి ముందు వెనుకా చెప్పుకోదగ్గ సక్సెస్ లేక బాలీవుడ్ కొన్ని వారాలుగా డీలాగా ఉంది. కిల్ కి మంచి రివ్యూలు వచ్చినా ఆహా అనిపించే కలెక్షన్లు దక్కలేదు. అందుకే బయ్యర్ల ఆశలన్నీ బ్యాడ్ న్యూజ్ మీదే ఉన్నాయి. ఎలాగూ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ వెరైటీని ఆదరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on July 10, 2024 11:12 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…