ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. బయట ఎంత సింపుల్‌గా కనిపిస్తాడో తెలిసిందే. సింపుల్‌గా ఒక టీషర్ట్, కార్గో జీన్స్ వేసుకుని.. మామూలు స్లిప్పర్స్ ధరించి బయటికి వచ్చేస్తుంటాడు. ఆ మాటకొస్తే సినిమా సెట్లో, ఏదైనా ఈవెంట్లో కూడా అతను అలాంటి సింపుల్ వస్త్రధారణతోనే కనిపిస్తాడు. ‘కల్కి’ సినిమా తీసినన్ని రోజులు అతను ఒకే స్లిప్పర్స్ పెయిర్ ధరించడం విశేషం. సినిమా రిలీజైనపుడు పాడైపోయిన స్థితిలో ఉన్న స్లిప్పర్స్ ఫొటోలను కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
నాగికి అమ్మాయినిచ్చిన మామ, ‘కల్కి’కి నిర్మాత కూడా అయిన అశ్వినీదత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగి సింప్లిసిటీ గురించి మాట్లాడాడు. ‘వైజయంతీ మూవీస్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. దీని ప్రోమోలో నాగి సింప్లిసిటీ గురించి దత్ మాట్లాడారు.
“జనం దృష్టిలో నాగ్ అశ్విన్ గొప్ప వ్యక్తి కానీ.. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. తన గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అతను మా ఇంటికి హడావుడిగా వస్తాడు. స్లిప్పర్స్ బయట విడిచి లోపలికి వస్తాడు. వెళ్లేటపుడు నా చెప్పులు వేసుకుని వెళ్లిపోతాడు. ఆశ్చర్యం ఏంటంటే.. వచ్చేటపుడు కూడా వాళ్ల నాన్న చెప్పులు వేసుకుని వస్తాడు” అంటూ నాగి గురించి సరదా విషయాలు చెప్పుకొచ్చారు దత్. పూర్తి ఇంటర్వ్యూలో నాగి గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నట్లే ఉన్నారు దత్.
ఇక ‘కల్కి’ సినిమాను రెండు భాగాలుగా తీయడం గురించి దత్ మాట్లాడుతూ.. కథా చర్చల సమయంలోనే రెండు భాగాలుగా చేయడం గురించి మాట్లాడుకున్నామని.. ఐతే కమల్ హాసన్ ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాక 2 పార్ట్స్‌గా తీస్తేనే ఈ కథకు న్యాయం జరుగుతుందని ఫిక్సయ్యామని దత్ చెప్పారు.
This post was last modified on July 9, 2024 7:13 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…