Movie News

సిద్దార్థ్ మాటల్లో లాజిక్ ఉంది కానీ

తెలుగు సినిమాల్లో ఈ మధ్య కనిపించడం తగ్గించేసినా బొమ్మరిల్లు సిద్దార్థ్ కు అభిమానుల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే మహా సముద్రంతో కంబ్యాక్ అన్నప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. దాని ఫలితం సంగతి ఎలా ఉన్నా ఒకప్పటి సిద్దు అలాగే ఉండటం చూసి ఫ్యాన్స్ సంతోషించారు. ఆ తర్వాత డబ్బింగ్ మూవీస్ టక్కర్, చిన్నాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చేసినా కోరుకున్న రిజల్ట్ దక్కలేదు. వీటి సంగతలా ఉంచితే సిద్ధార్థ్ కు ఫిల్టర్ లేకుండా ఓపెన్ గా మాట్లాడతాడని పేరుంది. అది ఇవాళ భారతీయుడు 2 హైదరాబాద్ ప్రెస్ మీట్ లో బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే ఇటీవలే తెలంగాణ సిఎం పెద్ద హీరోలు తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కావాలంటే డ్రగ్స్ లాంటి మహమ్మారి మీద సోషల్ అవేర్నెస్ వీడియోలు చేసి ఇస్తేనే అనుమతులు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీన్నే మీడియా ప్రతినిధులు సిద్దార్థ్ ముందు ప్రస్తావించగా తను అన్న మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఇరవై సంవత్సరాల కెరీర్ లో ఎప్పుడో 2005లోనే కాండోమ్స్ వాడమని చెప్పి సామజిక బాధ్యత తీసుకున్న హీరోనని, ఏ ముఖ్యమంత్రి తమకు ఇది చేస్తే మీకు ఇది ఇస్తామని అడగలేదని, ఇన్ డైరెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కండీషన్ మీద పంచు వేశాడు.

సరే సిద్దార్థ్ ఉద్దేశం ఏదైనా రెండు వైపులా ఆలోచిస్తే ఇద్దరూ కరెక్టేనని చెప్పాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వీడియో నిబంధన సమాజానికి మేలు చేసేది. స్పృహ కలిగించే సందేశం సెలబ్రిటీల ద్వారా త్వరగా చేరుతుంది. సిద్దార్థ్ చెప్పినట్టు గతంలో ఎవరూ అడగకపోయి ఉండొచ్చు కానీ మొదలంటూ ఒకరు చేస్తే క్రమంగా మరొకరు ఫాలో అయ్యేందుకు అవకాశం ఇస్తుంది. పైగా అందులో రిస్క్ ఏమీ లేదు. మహా అయితే ఒక రోజు షూట్ మించి ఉండదు. టికెట్ రేట్ల వల్ల కోట్లాది రూపాయల అదనపు ఓపెనింగ్స్ వచ్చినప్పుడు యాడ్స్ చేయడంలో తప్పేమి లేదు. సరే ఎవరి ఆలోచన వాళ్ళది.

This post was last modified on July 8, 2024 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రా మచ్చా వెనుక సోషల్ మీడియా రచ్చ

ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ రెండో పాట 'రా మచ్చ రా' మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.…

2 hours ago

దేవర 2 వెనుక పెద్ద స్కెచ్చే ఉంది

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ అనుకున్నది సాధించేశారు. దేవర పార్ట్ 1 అంచనాలకు మించి విజయం సాధించడంతో వాళ్ళ…

3 hours ago

వంద రోజుల దగ్గరలో కల్కికో సమస్య

వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడి విడుదలై…

6 hours ago

సూర్య కంగువ….24 కనెక్షన్ ?

బాహుబలి రేంజులో కోలీవుడ్ స్థాయిని పెంచుతుందని అక్కడి యావత్ పరిశ్రమ ఆశలు పెట్టుకున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. ఇప్పటికే…

7 hours ago

శ్రీకాకుళంలో వైసీపీ ధ‌ర్మాన చిచ్చు.. ఎప్ప‌టికి చ‌ల్లారునో.. !

అధికారంలో ఉన్న‌ప్పుడు అంతా నాదే అంటూ.. కొంద‌రు వైసీపీ నేత‌లు చెల‌రేగిపోయారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు అవ‌కాశం కూడా క‌ల్పించ‌లేదు. బ‌ల‌మైన…

7 hours ago

వీరయ్య నాయుడు స్ఫూర్తితో వైజాగ్ వాసు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ మధ్య విభిన్నంగా ఏదైనా చేద్దామని ఒప్పుకున్న సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి. గని,…

8 hours ago