తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ సినిమా అంటే సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ఉండాల్సిందే. తప్పనిసరి పరిస్థితుల్లో అపరిచితుడు, స్నేహితుడు చిత్రాలకు మాత్రమే రెహమాన్ శిష్యుడైన హారిస్ జైరాజ్‌తో సంగీతం చేయించుకున్నాడు కానీ.. మిగతా అన్ని చిత్రాలకూ రెహమాన్‌తోనే జట్టు కట్టాడు శంకర్. కానీ ఇండియన్-2 సినిమాకు మాత్రం రెహమాన్ కాకుండా, హారిస్‌నూ తీసుకోకుండా అనిరుధ్‌తో పని చేశాడు.
ఇండియన్ సినిమాకు రెహమాన్ సంగీతం ఎంత పెద్ద ప్లస్సో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అనిరుధ్‌కు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. రెహమాన్‌తోనే ఇండియన్-2కు సంగీతం ఇప్పించి ఉండాల్సిందనే అభిప్రాయం ఉంది. ఐతే ఈ మార్పుకు కారణమేంటో ఒక ఇంటర్వ్యూలో శంకర్ వెల్లడించాడు.
“నేను 2.0 చేస్తున్నపుడే ఇండియన్-2 పనులు మొదలయ్యాయి. కమల్ సర్ డేట్లు కూడా కేటాయించేశారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను మొదలుపెట్టాల్సిన ఉంది. అప్పుడు రెహమాన్ 2.0 బ్యాగ్రౌండ్ స్కోర్ పనుల్లో తలమునకలై ఉన్నాడు. ఇండియన్-2కు సంగీత చర్చలు మొదలుపెట్టే అవకాశమే లేదు. రెహమాన్‌కు వేరే కమిట్మెంట్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ తరంలో నాకెంతో నచ్చిన సంగీత దర్శకుల్లో ఒకడైన అనిరుధ్‌ను ఎంచుకున్నాను. 2.0 లాంటి కాంప్లెక్స్ మూవీ కోసం ఎంతో కష్టపడ్డ రెహమాన్.. ఆ సమయంలో ఇండియన్-2కు పాటుల చేయడం కష్టమనిపించింది. అందుకే వేరే ఛాయిస్ తీసుకున్నా. నాకు యువన్ శంకర్ రాజా, సంతోష్ నారాయణన్, హారిస్ జైరాజ్‌ల సంగీతం అన్నా చాలా ఇష్టం” అని శంకర్ తెలిపాడు.
రెహమాన్ ఇండియన్-2కు పని చేయకపోయినా ఈ సినిమా ఆడియో లాంచ్‌లో అనిరుధ్ సహా అందరూ అతణ్ని గౌరవించారు. ఇండియన్-2 ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 7, 2024 10:10 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…