Movie News

మ్యాజికల్ కాంబో.. మళ్లీ

యువ కథానాయకుడు నితిన్ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన చిత్రం.. ఇష్క్. వరుసగా డజను ఫ్లాపులు ఎదుర్కొని ఇక కెరీర్ ముగిసినట్లే అనుకున్న తరుణంలో అతను ఈ చిత్రంతో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే ఇష్టం, 13 బి లాంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు సంపాదించినప్పటికీ.. కెరీర్ ముందుకు వెనక్కి అన్నట్లు సాగుతుండడంతో దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా ఇబ్బంది పడుతుండేవాడు. అతణ్ని తెలుగులో బిజీ దర్శకుడిగా మార్చిన చిత్రం.. ఇష్క్.

పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ మూవీ.. సూపర్ హిట్ అయి తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయి. ఈ చిత్రంతో వచ్చిన గుర్తింపుతో విక్రమ్.. మనం, 24 లాంటి పెద్ద సినిమాలు చేశాడు. కానీ మళ్లీ అతను నితిన్‌తో మాత్రం జట్టు కట్టలేదు.

ఐతే ఎట్టకేలకు మళ్లీ ఈ మ్యాజిక్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. నితిన్ హీరోగా విక్రమ్ ఓ యాంబిషియస్ ప్రాజెక్టు చేయబోతున్నాడట. ఇది పెద్ద బడ్జెట్లో, విభిన్నమైన కథతో తెరకెక్కబోతోందట. నితిన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కే సినిమా ఇదని.. ఇప్పటిదాకా ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో విక్రమ్ ఈ చిత్రం చేయబోతున్నాడని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

విక్రమ్ నుంచి ఈ మధ్య అంచనాలకు తగ్గ సినిమాలు రావట్లేదు. చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘థాంక్యూ’ పెద్ద డిజాస్టర్ అయింది. అంతకుముందు రిలీజైన ‘గ్యాంగ్ లీడర్’ సైతం అంచనాలను అందుకోలేకపోయింది. ఐతే మధ్యలో ‘దూత’ వెబ్ సిరీస్‌తో విక్రమ్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం దానికి సీక్వెల్ తీస్తున్నాడు. దాని తర్వాత నితిన్ సినిమాను పట్టాలెక్కిస్తాడు.

This post was last modified on July 6, 2024 11:11 am

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

59 minutes ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago