ఉప్పెన సెన్సేషనల్ మూవీతో అరంగేట్రంలోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది కన్నడ అమ్మాయి కృతి శెట్టి. ఆమె నటించిన రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ కూడా మంచి విజయాన్నే సాధించింది. కానీ ఆ తర్వాత ఆమెకు అస్సలు కలిసి రాలేదు. వరుస పరాజయాలు వెంటాడాయి. ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ.. ఇలా ఆమె చివరి చిత్రాలన్నీ నిరాశ పరిచాయి.దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు.
విరామం తర్వాత ఇటీవలే కృతి నటించిన మనమే సినిమా రిలీజైంది. దాని మీద ఆమె చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఇది కూడా తనను నిరాశకే గురి చేసింది. కృతి చేసిన గత చిత్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఫ్లాప్‌గానే నిలిచింది.
ఐతే తెలుగులో ఇలా వరుసబెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నా తమిళంలో మాత్రం కృతికి అవకాశాలు ఆగట్లేదు. ఆల్రెడీ జయం రవి సరసన జెనీ అనే ఫాంటసీ మూవీలో కథానాయికగా నటిస్తోంది కృతి. దీంతో పాటు లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్‌తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే సినిమాలోనూ నటిస్తోంది. ఈ మధ్యే కార్తి కొత్త చిత్రానికి కూడా కృతినే కథానాయికగా ఎంచుకున్నారు. చేతిలో ఇన్ని సినిమాలు పెట్టుకుని.. తమిళంలో మరో కొత్త చిత్రం ఒప్పుకుంది కృతి. ఈసారి ఆమె మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించబోతోంది. సెల్వమణి సెల్వరాజ్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.
విశేషం ఏంటంటే.. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి నిర్మాణ భాగస్వామి అట. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రానుంది. రానా ప్రస్తుతం 35 అనే చిన్న చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…