Movie News

కమల్ హాసన్ పెద్ద షాకే ఇచ్చారు

ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న భారతీయుడు 2కి భారీ స్థాయిలో ఉండాల్సిన హైప్ కనిపించకపోయినా రిలీజ్ నాటికి థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతారని బయ్యర్లు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతున్న కమల్ హాసన్ ఇప్పుడీ సీక్వెల్ కంటే మూడో భాగాన్ని ఎక్కువగా ఎలివేట్ చేయడం అభిమానులకు టెన్షన్ కలిగిస్తోంది. ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ తాను సెకండ్ పార్ట్ కి అభిమానిని కానని, మూడో భాగానికి ఫ్యానని చెప్పడం హాజరైన వాళ్ళను షాక్ కలిగించింది. అంటే అసలైన కథ అందులో ఉందనే క్లూస్ ఇచ్చినట్టు భావిస్తున్నారు.

బజ్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి స్టేట్మెంట్లు అంచనాలు తగ్గిస్తాయి. భారతీయుడు 2లో సిద్దార్థ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని, కాజల్ అగర్వాల్ ని వాడుకోకుండా 3 కోసం దాచారని, చంద్రూ తాతయ్య అలియాస్ సేనాపతి తండ్రి కూడా దాంట్లోనే వస్తాడనే వార్తల నేపథ్యంలో ఇప్పుడీ రెండో ఇండియన్ లో ఏముందనే అనుమానం కలగడం సహజం. తమిళం సంగతి ఏమో కానీ తెలుగులో మాత్రం కల్కి 2989 ఏడి ఫీవర్ రెండో వారంలోనూ కొనసాగుతోంది. జూలై 12కి తగ్గుతుందా అంటే ఏమో చెప్పలేం. ఆ రోజు నుంచే సాధారణ రేట్లకు టికెట్లు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆక్యుపెన్సీలు పెరగొచ్చు.

సరే ఏదైతేనేం భారతీయుడు 2 ఫలితం ఒకవేళ ఏ మాత్రం అటుఇటు అయినా ఆదుకోవడానికి మూడో భాగం ఉంటుందనే కోణంలో డిస్ట్రిబ్యూటర్లు నిశ్చింతగా ఉండొచ్చు. అయితే దర్శకుడు శంకర్ మాత్రం కమల్ విశ్వరూపాన్ని ఇప్పుడీ ఇండియన్ 2లో చూస్తారని హామీ ఇస్తున్నారు. ట్రైలర్ లో చూపించిన రకరకాల గెటప్పులు, ఫైట్లు అన్నీ ఇందులోనే ఉంటాయానే డౌట్ క్రమంగా మొదలవుతోంది. రిజల్ట్ ని బట్టి థర్డ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారు. షూటింగ్ అయితే సమాంతరంగా జరిగిపోయింది. అనిరుద్ రవిచందర్ నేపధ్య సంగీతం మీద ప్రత్యేక అంచనాలున్నాయి.

This post was last modified on July 3, 2024 11:06 am

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

25 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago