ఒక్క పుష్ప-2 సినిమా ఆగస్టు 15 నుంచి వాయిదా పడేసరికి.. దేశంలో వివిధ భాషల నుంచి ఆ వీకెండ్‌కు కొత్త సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. పుష్ప-2 అనుకున్న ప్రకారం విడుదలయ్యేట్లుంటే.. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ప్రధాన భాషల్లో చెప్పుకోదగ్గ వేరే రిలీజ్‌లు ఏవీ ఉండేవి కావు. పుష్ప-2 వాయిదా వార్తలు బయటికి రాగానే.. పూరి జగన్నాథ్-రామ్‌ల డబుల్ ఇస్మార్ట్ మూవీని ఆ డేట్‌కు ఫిక్స్ చేసేశారు.
ఆ తర్వాత ఆయ్, 35 లాంటి చిత్రాలు అదే వీకెండ్‌కు ఫిక్స్ అయ్యాయి. ఇంకా విశ్వం సహా ఒకట్రెండు సినిమాలు ఈ వీకెండ్ మీద కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా హిందీ, తమిళంలో వరుసగా ఒక్కో సినిమాను ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు అనౌన్స్ చేస్తున్నారు. హిందీలో అక్షయ్ కుమార్ మూవీ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహాం చిత్రం వేదా కూడా ఆ వీకెండ్లోనే వస్తాయని అంటున్నారు.
కాగా ఇప్పుడు తమిళం నుంచి ఓ భారీ చిత్రాన్ని ఆగస్టు 15కు ఖరారు చేశారు. ఆ చిత్రమే.. తంగలాన్. విక్రమ్ హీరోగా విలక్షణ దర్శకుడు పా.రంజిత్ రూపొందిస్తున్న చిత్రం తంగలాన్. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సింది. కానీ చిత్రీకరణ ఆలస్యం కావడం, వేరే కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. వేసవిలో అనుకున్నారు కానీ కుదరలేదు. చివరికి ఆగస్టు 15కు ఫిక్స్ చేశారు.
ఈ చిత్రంపై తమిళంలోనే కాక దక్షిణాది భాషలన్నింట్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. విక్రమ్ ఈ చిత్రం కోసం గుర్తు పట్టలేని అవతారంలోకి మారాడు. ఆయన సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం కల్ట్ స్టేటస్ తెచ్చుకోగలదనే అంచనాలున్నాయి. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో సౌత్ ఇండియా వరకు ఇదే బాక్సాఫీస్ విన్నర్ కావచ్చు.
This post was last modified on July 1, 2024 9:30 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…