మంచు విష్ణు హీరోగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న కన్నప్ప విడుదల తేదీ ఇంకా ఖరారు చేయకపోయినా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. క్యామియోనే అయినప్పటికి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ డివోషనల్ గ్రాండియర్ కు ప్రభాస్ ఇమేజ్ పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాల్లో మార్కెట్ సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే వచ్చిన కన్నప్ప టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపించింది. కేవలం విష్ణుని మాత్రమే రివీల్ చేసి ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితరులను చూపించకుండా తెలివిగా కట్ చేశారు. కొంత ట్రోలింగ్ జరగడం వేరే విషయం.
కన్నప్పలో ప్రభాస్ మరీ తక్కువ లెన్త్ లో ఉండడని, కావల్సిన నిడివిలో అడగ్గానే నటించాడని లాంచ్ ఈవెంట్ లో విష్ణు చెప్పడం గుర్తే. కల్కి 2898 ఏడి సాధించిన విజయం డార్లింగ్ ఇమేజ్, బ్రాండ్ రెండింటిని ఇంకా పైకి తీసుకెళ్లింది. దీంతో ఈ సక్సెస్ ని కన్నప్పకు అనుకూలంగా వాడుకోవడం మీద మంచు టీమ్ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ప్రభాస్, మోహన్ లాల్ లాంటి స్టార్లు ఉన్నారనే విషయాన్ని ప్రమోషన్ల ద్వారా బలంగా రిజిస్టర్ చేయగలిగితే ఓపెనింగ్స్ కి ఎలాంటి లోటు ఉండదు. పైగా ఈవెంట్లకు వీళ్ళందరూ అతిథులుగా వస్తారు కాబట్టి దేశవ్యాప్తంగా మీడియా అటెన్షన్ ఉంటుంది.
ఇప్పుడు కన్నప్ప చేయాల్సింది రిలీజ్ ని ఫిక్స్ చేసుకుని దానికి తగ్గట్టు సరైన పబ్లిసిటీ ప్లాన్ ని డిజైన్ చేసుకోవడం. సలార్, కల్కిలాగా చేయకపోయినా ఇబ్బందేమీ లేదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది ప్రభాస్ మూవీ కాదు. మంచు విష్ణు సినిమా. ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అది సరైన రీతిలో జనాలకు చేరేలా చూసుకోవాలి. కొన్ని ప్రతికూల వర్గాలు అదే పనిగా టార్గెట్ చేసినా దానికి నెరవకుండా ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి. దసరా, దీపావళి లేదా డిసెంబర్ ఇలా మూడు ఆప్షన్లు చూస్తున్న కన్నప్పకు ప్రభాస్ క్యామియో అతి పెద్ద బంగారు కవచంలా మారే మాట వాస్తవం.
This post was last modified on July 1, 2024 9:04 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…