ఈ గురువారం రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. సినిమాలో కూడా దీని గురించి క్లారిటీ ఇచ్చేశారు. ‘బాహుబలి’ తరహాలోనే కథను మధ్యలో ఆపేసిన దర్శకుడు నాగ్ అశ్విన్.. కల్కి యూనివర్శ్ కొనసాగుతుందని ప్రకటించాడు. దీంతో దాని కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఐతే ‘కల్కి’ సినిమాను అనౌన్స్ చేసిన నాలుగేళ్లకు కానీ ఫస్ట్ పార్ట్ విడుదల కాలేదు. ఇక సెకండ్ పార్ట్ ఎప్పటికి పూర్తయి.. ఎప్పుడు రిలీజ్ కావాలి అనే నిరాసక్తత అభిమానుల్లో కనిపించింది. ఐతే ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు మంచి బూస్ట్ ఇచ్చే వార్త చెప్పారు నిర్మాత అశ్వినీదత్. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘కల్కి-2’ చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తయినట్లు వెల్లడించారు.
సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్య సన్నివేశాలను తీసేశామని.. ఇంకా కొన్ని మేజర్ పోర్షన్స్ తీయాల్సి ఉందని.. కల్కి-2ను ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని ఆయన తెలిపారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయిందంటే ఇంకో ఏడాదిలోపే పార్ట్-2ను రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్నట్లే. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది వేసవికే కల్కి-2 రిలీజవుతుందేమో.
‘కల్కి’ పార్ట్-1లో ప్రభాస్ పాత్ర చాలా వరకు నెగెటివ్ షేడ్స్‌తోనే సాగుతుంది. చివర్లో చిన్న పాజిటివ్ టచ్ ఇచ్చినా.. ఆ పాత్రలో ఇంకా పరివర్తన రాలేదు. రెండో భాగంలో భైరవ పాత్రలో మార్పు వచ్చి.. సుప్రీమ్ యాస్కిన్ మీద పోరాడే నేపథ్యంలో కథ నడుస్తుందనే అంచనాలున్నాయి. కమల్ పాత్రను కూడా ఫస్ట్ పార్ట్‌లో పెద్దగా చూపించలేదు. రెండో భాగంలో ఆయన విశ్వరూపం చూస్తామని అంటున్నారు. ప్రభాస్-కమల్ మధ్య ఎపిక్ క్లాష్‌ను రెండో భాగంలో చూపిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on June 29, 2024 2:40 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…