Movie News

కృష్ణుడి జపం చేస్తున్న సోషల్ మీడియా

కల్కి 2898 ఏడి పుణ్యమాని సినిమాని బాగా ఇష్టపడిన కుర్రకారు మహాభారత పాత్రల గురించి గూగుల్ చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా కురుక్షేత్రం గురించి ఏదో కొంత అవగాహన తప్ప ఆ పురాణం గురించి లోతుగా తెలిసిన ఈ జనరేషన్ యూత్ తక్కువ. అందుకే అశ్వద్ధామతో మొదలుపెట్టి కర్ణుడి దాకా ఎవరెవరు ఎవరికి ఏమవుతారనే దాని మీద స్వంతంగా విశ్లేషణలు చేసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కృష్ణుడి పాత్ర గురించి జరుగుతున్న డిస్కషన్ అంతా ఇంతా కాదు. దాన్ని పోషించిన నటుడి మొహం చూపించకపోయినా సరే రకరకాల కోణాల్లో పరిశోధన మొదలుపెట్టారు.

కొందరు కల్కి 2లో మహేష్ బాబు కృష్ణుడు అయితే బాగుతుందంటారు. మరికొందరు నానితో చేయిస్తే అదిరిపోతుందని వివరిస్తారు. ఇంకొందరు ఎవరో ఎందుకు ప్రభాస్ కే ఆ గెటప్ బ్రహ్మాండంగా నప్పుతుందని అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీ కృష్ణ పరమాత్ముడు అవతారం చాలించాక ఏమయ్యాడు, ఆయనకు మరణం ఎలా సంభవించింది, అశ్వద్ధామ కుంజరః కుట్ర వెనుక నేపథ్యం ఏంటని వెతుకులాట చేస్తున్నారు. ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం వచ్చిన చందమామ పుస్తకం కథల నుంచి గీత ట్రస్ట్ మహాభారతం దాకా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పుస్తకాలు తిరగేస్తున్నారు.

దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే మహాభారతంలో క్యారెక్టర్ల మీద గతంలో పలువురు నటీనటులు మాట్లాడిన వీడియోలను వెతికి మరీ ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. చూస్తుంటే నాగ్ అశ్విన్ కల్కి 2కి సంబంధించి చాలా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చేలా ఉంది. కమల్ హాసన్ భారతీయుడు 2 ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి చూస్తే స్క్రిప్ట్ సిద్ధంగానే ఉన్నట్టుంది. కాకపోతే ఎప్పుడు మొదలు పెడతారనేది వేచి చూడాలి. కొంత భాగం అయ్యిందట కానీ షూట్ చేయాల్సింది చాలానే ఉందని యూనిట్ టాక్. ఏదైతేనేం కల్కి వల్ల పురాణాలు, ఇతిహాసాల మీద చర్చ జరుగుతోంది.

This post was last modified on June 29, 2024 10:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

10 minutes ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

16 minutes ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

58 minutes ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

1 hour ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

2 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

2 hours ago