బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సౌత్ సినిమాల్లో తరచు నటించడం కొత్తేమి కాదు కానీ కల్కి 2898 ఏడి విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోషన్లలో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. విడుదల తేదీకి ముందు రోజు అర్ధరాత్రి సైతం క్రమం తప్పకుండా ట్వీట్లు పెట్టారంటే తాను పోషించిన అశ్వద్ధామ పాత్రను ఎంతగా ప్రేమించారో అర్థం చేసుకోవచ్చు. సినిమా చూశాక అభిమానులతో పాటు అందరికీ క్లారిటీ వచ్చేసింది. దాదాపు ప్రభాస్ కున్నంత ప్రాధాన్యతతో దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ ని వాడుకున్న విధానం ఓ రేంజ్ లో స్క్రీన్ మీద పండిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
చెప్పాలంటే వయసు మళ్ళిన అశ్వద్ధామగా అమితాబ్ తెరమీద మేజిక్ చేసి పడేశారు. ముఖ్యంగా ప్రభాస్ తో సెకండ్ హాఫ్ లో ఫైట్ చేసే ఎపిసోడ్స్ లో చెలరేగిపోయారు. కొత్త ఉత్సాహం తొణికిసలాడింది. మేకింగ్ వీడియోస్ లో చూస్తే డూప్ అవసరం లేకుండా గ్రీన్ మ్యాట్ అయినా సరే శ్రద్ధగా స్టంట్స్ లో పాల్గొన్న విధానం ఆశ్చర్యపరుస్తుంది. ఎనభై ఏళ్ళ వయసులో ఇంత కమిట్ మెంట్ నటుల్లో చూడటం చాలా అరుదు. అశ్వద్ధామ ఫ్లాష్ బ్యాక్ ని ఏఐ టెక్నాలజీ వాడి అమితాబ్ ని కుర్రాడిగా చూపించడం కూడా బాగా వచ్చింది. ఏ మాత్రం తేడా కొట్టినా ఇంపాక్ట్ తగ్గిపోయేది.
ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభాస్ ఇమేజ్ తో పాటు అమితాబ్ కు ఎక్కువ స్పేస్ దొరికిందన్న టాక్ కలెక్షన్ల పరంగా దోహదం చేస్తోంది. ఆయన అభిమానులు బిగ్ బిని ఇంత శక్తివంతమైన పాత్రలో చూసి చాలా కాలమయ్యిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండో భాగం ఉంది. అశ్వద్ధామ, భైరవలు కల్కి 2898 చివరి అరగంటలో మాత్రమే కలుసుకున్నారు. పరస్పర జన్మ రహస్యాలు తెలిసిపోయాయి కాబట్టి ఇద్దరూ కలిసి కమల్ హాసన్ పోషించిన యాస్కిన్ ని ఎలా ఎదురుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సక్సెస్ చూశాక రెట్టింపు ఎనర్జీతో అమితాబ్ బచ్చన్ కల్కి 2లో భాగం కాబోతున్నారని వేరే చెప్పాలా.
This post was last modified on June 28, 2024 4:02 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…