యానిమల్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ లో ఏ స్థాయిలో క్రేజ్ పెరిగిందో చెప్పడం కష్టం. కబీర్ సింగ్ టైంలోనే తన టాలెంట్ ఋజువు చేసుకున్నప్పటికీ అది అర్జున్ రెడ్డి రీమేక్ కావడంతో అసలైన సత్తా బయటపడింది మాత్రం రన్బీర్ కపూర్ మూవీతోనే. అందుకే టి సిరీస్ సంస్థ అతన్ని తమతోనే బంధించేసుకుని భద్రకాళి బ్యానర్ తో భాగస్వామ్యం పెట్టేసుకుంది. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం కల్కి 2898 ఏడి. మతిపోయే ఓపెనింగ్స్ తో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ విజువల్ గ్రాండియర్ కు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లు కనిపిస్తున్నాయి.
కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ కి నార్త్ లో ఎలాంటి బ్రాండ్ లేదు. ఎవడే సుబ్రమణ్యం, మహానటిలు వాళ్లకు రీచ్ కాకపోవడమే దానికి కారణం. అయినా సరే ప్రభాస్ ఇమేజ్ తో పాటు తనేం చెప్పాలనుకున్నాడో ట్రైలర్ లో చూపించిన విధానం ప్రేక్షకుల్లో హైప్ తీసుకొచ్చింది. ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్ చేయబోయే చిత్రం స్పిరిట్. సందీప్ వంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో హీరో క్యారెక్టరైజేషన్ గురించి చూచాయగా చెబుతూ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ని ఎప్పుడూ చూడని రేంజ్ లో ప్రెజెంట్ చేస్తానని స్క్రిప్ట్ స్టేజిలోనే అంచనాలు పెంచుతున్నాడు.
ఇప్పుడే ఇలా ఉంటే స్పిరిట్ రిలీజయ్యే సమయానికి బాహుబలి హీరో, యానిమల్ డైరెక్టర్ కలయిక అనే ట్యాగ్ వందల కోట్ల రూపాయల బిజినెస్ ని వెల్లువలా తెచ్చి పెడుతుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా దీని మీదే ఒకే స్థాయి బజ్ వచ్చేస్తుంది. సందీప్ వంగా కల్కికి జరుగుతున్నది చూస్తుంటాడు కాబట్టి తన మీద బరువు ఏ స్థాయిలో ఉండబోతోందో అర్ధమయ్యే ఉంటుంది. డిసెంబర్ లోగా రాజా సాబ్ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ ఎవరితో చేస్తాడనే క్లారిటీ ఇంకా లేదు. స్పిరిట్, హను రాఘవపూడి, సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం, కల్కి 2 ఉన్నాయి. ఏది ముందో తేలాలంటే వేచి చూడాలి.
This post was last modified on June 27, 2024 8:06 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…