దేశం మొత్తం మీద ఈ ఏడాది అత్యధిక అంచనాలు మోస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడికి ఈ రోజు మినహాయిస్తే కేవలం అయిదు రోజులు మాత్రమే సమయముంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నా కథ పరంగా సాధారణ ప్రేక్షకులకు కొన్ని సందేహాలు తలెత్తడంతో వాటికి పూర్తిగా అడ్డుకట్ట వేసేలా మరో వెర్షన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లోనే కాదు టాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ గా చెప్పబడుతున్న కల్కి మీద మాములు అంచనాలు లేవు. ఇండియా వైడ్ భారీ ఎత్తున రికార్డులు నమోదు కావడం ఖాయమే.
ఎపుడూ చూడని కొత్త ప్రపంచంలో మానవ జన్మకు సార్థకత చేకూర్చే ఒక కారణ జన్ముడిని మోస్తున్న ఒక తల్లి(దీపికా పదుకునే) కి అభయమిచ్చే ఒక వయసు మళ్ళిన యోధుడు(అమితాబ్ బచ్చన్). సర్వ భోగాలు దొరికే కాంప్లెక్స్ లోకి వెళ్లాలని ప్రయత్నించే భైరవ (ప్రభాస్) కు పైన చెప్పిన ఇద్దరికీ ఏదో సంబంధం ఉంటుంది. చివరి నగరమైన కాశిలో సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు రక్షకుడిగా మారే బాధ్యత భైరవ మీద ఉంటుంది. బుజ్జి వాహనాన్ని తీసుకుని అతను చేసే విన్యాసాలు, సాహసాలు, వాటి మధ్యలో ముసలి పురోహితుడి(కమల్ హసన్) కి ఉన్న సంబంధం ఏమిటనేది తెరమీద చూడాలి.
మొదటి ట్రైలర్ కి దీనికి పూర్తిగా భిన్నం అనిపించే ట్రైలర్ కట్ చేయించాడు నాగ అశ్విన్. కేవలం అబ్బురపరిచే గ్రాఫిక్స్ కాకుండా ఎమోషన్స్, యాక్షన్స్, థ్రిల్స్, గూస్ బంప్స్ ఇచ్చే విజువల్ ఎఫెక్ట్ ఇలా ఒక కంప్లీట్ ప్యాకేజీగా కల్కి 2898 ఏడిని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో పాటను భావోద్వేగాలతో నింపడం తెలివైన ఎత్తుగడ. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు అత్యున్నత సాంకేతిక విలువలు అంచనాలను అమాంతం పెంచేలా ఉన్నాయి. జూన్ 27 కళ్లద్దాలు పెట్టుకుని చూసే 3డి అనుభూతి కల్కి చేయబోయే మాయాజాలం రికార్డులన్నీ కొల్లగొట్టడం ఖాయం.
This post was last modified on June 21, 2024 9:44 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…