నవ దళపతి అనే కొత్త బిరుదు పెట్టుకుని ఊర మాస్ కంటెంట్ తో వచ్చిన హరోంహర సుధీర్ బాబు కోరుకున్న స్థాయిలో ఫలితం ఇవ్వలేకపోయిందనేది స్పష్టం. గత డిజాస్టర్లు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్ లాంటి వాటితో పోలిస్తే దీనికి చాలా మెరుగైన టాక్ వచ్చిన మాట వాస్తవం. అలా అని అందరూ అదిరిపోయింది అనలేదు. ఉన్నంతలో మాస్ జనాలకు ఓకే అనిపించే కంటెంట్ ఉందనే అభిప్రాయం రివ్యూలలోనూ వ్యక్తమయ్యింది. కానీ మొదటి మూడు రోజులు పర్వాలేదనిపించిన హరోంహర సోమవారం నుంచి కాస్త ఎక్కువ డ్రాప్ నమోదు చేయడం నిర్మాతలను నిరాశ కలిగించే అంశం.
ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్ మేరకు హరోంహర బ్రేక్ ఈవెన్ కు సుమారు ఆరున్నర కోట్ల షేర్ రావాలి. కానీ అదింకా అందుకోలేదు. దానికి రెట్టింపు గ్రాస్ కావాలంటే వీక్ డేస్ లోనూ మంచి ఆక్యుపెన్సీలు చూపించాలి. కానీ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఈ సినిమాకు సంబంధించిన ఫిగర్స్ బయటికి రానివ్వడం లేదు. మొదటి రెండు మూడు రోజులు కోటికి పైగా గ్రాస్ వచ్చినా ఆ తర్వాత అది నలభై లక్షలకు పడిపోవడంతో పాటు మహారాజ ఇచ్చిన తీవ్రమైన పోటీ దెబ్బ పడేలా చేసింది. దానికి తోడు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లను చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఆపేయడం రీచ్ ని తగ్గిస్తోంది.
ఓవరాల్ గా చూసుకుంటే హరోంహర హిట్టు ముద్రకు కాస్తంత దూరంలోనే ఆగిపోయేలా ఉంది. దీంతో బ్లాక్ బస్టర్ ఖాయమని బలంగా నమ్మిన సుధీర్ బాబుకి చివరికి నిరాశ తప్పేలా లేదు. ఒకవేళ ఇదే కంటెంట్ పేరున్న స్టార్ చేసి ఉంటే ఫలితం మరోలా వచ్చేదన్న కామెంట్స్ లో నిజానిజాలు పక్కనపెడితే వ్యక్తిగతంగా తగ్గిపోయిన సుధీర్ బాబు మార్కెట్ హరోంహర లాంగ్ రన్ ని ప్రభావితం చేసిందన్న మాట వాస్తవం.
This post was last modified on June 20, 2024 11:26 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…