Movie News

బన్నీ మీద యుద్ధం ప్రకటించేశారు

ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ఒక్క రోజు ప్రచారం చేసినందుకు అల్లు అర్జున్ జీవితాంతం రిగ్రెట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మిత్రుడికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో వెళ్లాను తప్ప ఇందులో రాజకీయం ఏమీ లేదని బన్నీ వివరణ ఇచ్చుకున్నా సరే.. అది మెగా అభిమానుల్లో చాలామందికి రుచించలేదు.

ఓవైపు వైసీపీ మీద పోరాడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా అండగా నిలబడి పిఠాపురానికి వెళ్లి ప్రచారం కూడా చేస్తే.. బన్నీ అదే టైంలో వెళ్లి నంద్యాలలో శిల్పా రవి కోసం క్యాంపైనింగ్ చేయడాన్ని జనసైనికులు, మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. బన్నీ ఈ పని చేసి నెల రోజులు దాటినా కూడా వ్యవహారం సద్దుమణగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మరింత రెచ్చిపోయి బన్నీని ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. బన్నీని సోషల్ మీడియా ఖాతాల్లో అన్‌ఫాలో చేసిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మరింతగా బన్నీని టార్గెట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై బన్నీని ఎంతమాత్రం ఓన్ చేసుకోకూడదని, తన సినిమాలు కూడా చూడకూడదని మెగా ఫ్యాన్స్‌లో ఓ వర్గం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెరుగుతున్నాయి.

‘పుష్ప-2’ చిత్రాన్ని తాము కొన్ని కారణాల వల్ల కుటుంబంతో కలిసి చూడొద్దని నిర్ణయించుకున్నామంటూ జనసైనికులు, మెగా ఫ్యాన్స్ కొన్ని టెంప్లేట్ పోస్టులు పెడుతున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి పాకి.. ఒక ట్రెండ్ లాగా మారుతోంది. నిజానికి ‘పుష్ప-2’ను వాయిదా వేయడంలో బన్నీ మీద ప్రస్తుతం నెలకొన్న నెగెటివిటీ కూడా ఒక కారణమని అంటున్నారు. బిజినెస్ మీద బాగా ఎఫెక్ట్ పడేలా ఉండడం కూడా వాయిదా నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిందని చెబుతున్నారు. కొన్ని నెలలు గడిస్తే పరిస్థితి మారుతుందని అనుకుంటున్నారు కానీ.. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, జనసైనికుల తీరు చూస్తుంటే మాత్రం వాళ్లు ఎప్పుడు బన్నీని క్షమిస్తారన్నది అర్థం కావడం లేదు.

This post was last modified on June 18, 2024 2:35 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

2 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

2 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

2 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

6 hours ago