ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడి ట్రైలర్ మీద అంచనాలను మాటల్లో చెప్పడం కష్టం. ఇప్పటిదాకా ప్రమోషన్ పరంగా ఒక్క బుజ్జిని హైలైట్ చేయడం తప్ప ఎలాంటి వీడియోలు బయటికి రాకుండా దర్శకుడు నాగ అశ్విన్ జాగ్రత్త పడ్డాడు. అయినా సరే ఇంకో ఇరవై నాలుగు గంటల్లో కల్కి ప్రపంచపు సాంపిల్ చూస్తామని ఆనందిస్తున్న టైంలో కొందరు ఎడిట్ కాని వెర్షన్ ని లీకుల రూపంలో వైరల్ చేయాలని చూశారు. దీంతో ఒక్కసారిగా వైజయంతి బృందం అలెర్ట్ అయిపోయి లీగల్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈలోగానే మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది.
వినిపిస్తున్న టాక్ ప్రకారం కల్కిలో ఏముండబోతోందనే ఆసక్తి పదింతలు పెరిగేలా ఊరింపులు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్ లో ఏ మాత్రం నమ్మశక్యం కానీ విజువల్స్ తో నాగఅశ్విన్ మైండ్ బ్లాంక్ చేయడం ఖాయమని వినిపిస్తోంది. మొదటి నిమిషం ప్రభాస్ ని రివీల్ చేయకుండా పాత్రలను పరిచయం చేసి, భైరవ అవసరం ఎందుకు వచ్చిందో వివరించే నెరేషన్ తో మొదలుపెడతాట. క్యాస్టింగ్ పరంగానూ ఊహించని సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయి. మనకు తెలిసిన అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ కాకుండా బయటికి రివీల్ చేయనిషాకింగ్ ఆర్టిస్టులు కనిపిస్తారట.
మొబైల్ షూట్ చేసిన వీడియోకే ఈ రేంజ్ ఎలివేషన్లు ఇస్తూ ఉంటే ఇక 4కెలో డాల్బీ సౌండ్ తో అసలు ట్రైలర్ చూస్తే మతులు పోవడం ఖాయమే. జూన్ 27 విడుదల కాబోతున్న ఈ ఫాంటసీ డ్రామా తాలూకు బిజినెస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా కొలిక్కి తెస్తున్నారు. 12న చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం తర్వాత పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళబోతున్నారు. అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్రణాళిక సిద్ధమవుతోంది. హైదరాబాద్, ముంబైలో వేడుకలు ఉంటాయట. మూవీ లవర్స్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే కల్కి సస్పెన్స్ ఇంకొద్ది గంటల్లో పూర్తిగా తొలగిపోనుంది. చూద్దాం.
This post was last modified on June 10, 2024 4:42 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…