Movie News

భారతీయుడు తాత వెనుకబడుతున్నాడు

వచ్చే నెల విడుదల కాబోతున్న భారతీయుడు 2కి ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదని కమల్ హాసన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇటీవలే జూన్ ఒకటైన చెన్నైలో గ్రాండ్ గా ఆడియో లాంచ్ చేశాక ఒక్కసారిగా జనాల దృష్టి దీని మీద పడుతుందని లైకా టీమ్ భావించింది. మొదటి రోజు అనిరుద్ రవిచందర్ సంగీతం గురించి సోషల్ మీడియాలో హంగామా నడిచింది కానీ ఆ తర్వాత చప్పున చల్లారిపోయింది. ఇండియన్ మొదటి భాగానికి ప్రాణంగా నిలిచిన ఏఆర్ రెహమాన్ స్థాయిలో కుర్రాడు పాటలు ఇవ్వలేదనే కామెంట్లు, పోలికలు పుష్కలంగా వచ్చాయి. ఈ అంశమే ఖంగారు కలిగిస్తోంది.

విక్రమ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టరైనా దాని ప్రభావం భారతీయుడు 2 మీద అంతగా లేదన్నది ట్రేడ్ వర్గాల టాక్. ఈ కారణంగానే బిజినెస్ వ్యవహారాలు నెమ్మదిగా జరుగుతున్నట్టు తెలిసింది. డబ్బింగ్ రైట్స్ ఎగబడి కొనేందుకు రావడమో, లేదా హక్కులు మాకిమ్మంటూ నిర్మాత మీద ఒత్తిడి తేవడమో ఇలాంటివేవీ కనిపించడం లేదని చెన్నై టాక్. లైకాకున్న నెట్ వర్క్ దృష్ట్యా తెలుగులో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ముందైతే జనాల్లో దీని పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగేలా ఏదైనా చేయాలి. కమల్ క్యామియో చేసిన కల్కి 2898 ఏడి విడుదల వరకు ఈ పరిస్థితిలో మార్పు రాకపోవచ్చు.

భారతీయుడు 3 ఉండటం, రెండో భాగంలో అసలు కాజల్ అగర్వాల్ లేదని శంకర్ ముందే చెప్పేయడం, కథ మొత్తం సిద్దార్థ్ చుట్టే తిరుగుతుందనే లీక్ రావడం వగైరా అంశాలు అంచనాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఎప్పుడో 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు కావడం వల్ల ఇప్పటి తరం దీని మీద విపరీతమైన ఉత్సుకతలో లేరు. కాకపోతే శంకర్ అనే బ్రాండ్ క్రేజ్ తెచ్చి పెడుతోంది. ఆ మాటకొస్తే తన స్థాయి హిట్టు కొట్టి ఆయనకే ఏళ్ళు గడిచిపోయాయి. ఈ సినిమా ఫలితం ప్రభావం గేమ్ ఛేంజర్ మీద ఉంటుందనే మెగా ఫ్యాన్స్ ఆందోళనలో న్యాయం లేకపోలేదు. చూడాలి మరి.

This post was last modified on June 7, 2024 8:40 am

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

41 minutes ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

41 minutes ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

4 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

4 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

4 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

7 hours ago