ఒకప్పుడు ఎండల్లో కాళ్లు కాలుతున్నా, రాళ్లు- ముళ్లున్న రోడ్లలో కూడా జనం చెప్పులు లేకుండా తిరిగేవారు. చెప్పులు వేసుకోవడం ఒక లగ్జరీగా ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. బయట చెప్పుల్లేకుండా అడుగు పెట్టడం సంగతి అటుంచితే.. ఈ రోజుల్లో జనం ఇళ్లలో కూడా చెప్పులు వేసుకునే తిరుగుతారు. ఇలాంటి సమయంలో ఒక ప్రముఖ నటుడు చెప్పుల్లేకుండా తిరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
అతనే.. మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ. అతను కొన్ని నెలలుగా ఇలా చెప్పులు లేకుండా దర్శనమిస్తున్నాడు. అలా అని అతనేమీ అయ్యప్ప మాల లాంటిదేమీ ధరించలేదు. బయటికి కనిపించనివ్వకుండా విజయ్ ఇంకేదైనా మాలలో ఉండే ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ తాను ఇప్పుడే కాదు.. ఇంకెప్పుడూ కూడా చెప్పులు వేసుకోనని విజయ్ స్పష్టం చేయడం గమనార్హం.
కొన్ని నెలల కిందట ఊరికే చెప్పులు లేకుండా నడిచి చూద్దామని అనుకుని అలా ప్రయత్నించానని.. అది తనకెంతో బాగా అనిపించిందని.. అప్పట్నుంచి అది కంటిన్యూ చేస్తున్నానని విజయ్ తెలిపాడు. చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిదని.. మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుందని.. చెప్పులు లేకున్నా ఎలాంటి అసౌకర్యానికి, ఒత్తిడికి గురి కాలేదని విజయ్ తెలిపాడు.
తాను ఏదో దీక్ష చేస్తున్నానని అంతా అనుకున్నారని, అదేమీ లేదని.. ఇక జీవితమంతా చెప్పులు వేసుకోకూడదని నిర్ణయించుకున్నానని విజయ్ తెలిపాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ సైతం చెప్పులు వాడడు. బేర్ ఫుట్‌తోనే కనిపిస్తుంటాడు. తనకు చెప్పులు వేసుకోవడం ఎందుకో ఇష్టం ఉండదని అనుదీప్ ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
This post was last modified on May 30, 2024 11:54 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…