ఎప్పుడో పాతికేళ్ల కిందట వచ్చిన సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కడం అరుదైన విషయం. ‘90వ దశకంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనం రేపిన ‘భారతీయుడు’కు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. కమల్ హాసనే హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శంకరే రూపొందించాడు. ఈ సినిమా మొదలై నాలుగేళ్లు దాటిపోయింది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడి.. రెండేళ్ల విరామానంతరం తిరిగి పట్టాలెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
ముందు జూన్‌లోనే రిలీజ్ అనుకున్నారు కానీ.. తర్వాత ఇంకో నెల రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జులై 12న ‘భారతీయుడు’ బహు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతుండడం విశేషం.
ఐతే ‘భారతీయుడు-2’ మేకర్స్‌కు, ‘భారతీయుడు’ రీ రిలీజ్‌కు ఏ సంబంధం లేదు. ‘భారతీయుడు-2’ చిత్రాన్ని నిర్మిస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ‘భారతీయుడు’ తీసింది సీనియర్ నిర్మాత ఏఎం రత్నం. సీక్వెల్ రిలీజ్ కాబోతున్న నెల రోజుల ముందు ఈ చిత్రాన్ని అటు తమిళంలో, ఇటు తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు రత్నం. జూన్ 7కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఓ వారం పది రోజులైనా సినిమాను నడిపించాలని చూస్తున్నారు.
‘భారతీయుడు-2’ ప్రాపర్ సీక్వెల్ కావడంతో మొదట సినిమాను ఒకసారి థియేటర్లలో దర్శించి ఆ తర్వాత సీక్వెల్‌కు వెళ్లడం ప్రేక్షకులకు బాగానే ఉంటుంది. కాకపోతే కల్ట్ మూవీ అయిన ‘భారతీయుడు’ను చూశాక పెరిగే అంచనాలను సీక్వెల్ అందుకోవడం కష్టమే. చాలా ఏళ్లుగా తన సినిమాలేవీ సరిగా ఆడక, ‘హరి హర వీరమల్లు’ ఆలస్యం కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు రత్నం. ఇటీవలే ఆయన ‘గిల్లి’ సినిమాను రీ రిలీజ్ చేస్తే మంచి ఆదాయం వచ్చింది. అలాగే ‘ఇండియన్’ రీ రిలీజ్‌తోనూ నాలుగు కాసులు వెనుకేసుకోవాలని ఆయన భావిస్తుండొచ్చు.
This post was last modified on May 26, 2024 6:44 pm
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…