ల‌వ్ మి.. జ‌నం వ‌చ్చారండోయ్

ఐతే శుక్ర‌వారం విడుద‌లైన రాజు యాద‌వ్ సినిమాను జ‌నం ప‌ట్టించుకోలేదు. కానీ శ‌నివారం మాత్రం థియేటర్ల‌లో సంద‌డి క‌నిపించింది. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి, బేబి ఫేమ్ వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా న‌టించిన ల‌వ్ మి సినిమాతో మ‌ళ్లీ థియేట‌ర్లలో జ‌నం క‌నిపించారు.

ల‌వ్ మికి మొన్న‌టిదాకా పెద్ద‌గా బ‌జ్ లేన‌ట్లే క‌నిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజ‌న‌కంగా లేవు. దీంతో దిల్ రాజు అండ్ టీం కంగారు ప‌డే ఉంటుంది. కానీ శనివారం మార్నింగ్ షోల‌కు ఇటు సింగిల్ స్క్రీన్లు, అటు మ‌ల్టీప్లెక్సుల్లో బాగానే జ‌నం క‌నిపించారు. కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా ప‌డ్డాయి. ఎట్ట‌కేల‌కు జ‌నం మ‌ళ్లీ ఓ సినిమాను థియేట‌ర్ల‌లో చూసేందుకు ఆస‌క్తి చూపించారు. ఎక్కువ‌గా వాకిన్స్‌తోనే థియేట‌ర్ల‌లో క‌ళ వ‌చ్చింది.

ఐతే ల‌వ్ మి ఈ అవ‌కాశాన్ని ఎంత‌మేర ఉప‌యోగించుకుంటుంద‌న్న‌దే ప్ర‌శ్నార్థ‌కం. ఈ చిత్రానికి ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన‌ప్ప‌టికీ.. గంద‌ర‌గోళంగా సాగిన న‌రేష‌న్, అన్ క‌న్విన్సింగ్ క్యారెక్ట‌ర్లు సినిమాకు ప్ర‌తికూలంగా మారాయి. ఇటు రివ్యూలు, అటు మౌత్ టాక్ ఏమంత బాగా లేదు. ఐతే వీకెండ్ వ‌ర‌కు సినిమా ఎలాగోలా న‌డిస్తే సేఫ్ జోన్లోకి వెళ్లే అవ‌కాశ‌ముంటుంది.