తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు సింగల్ స్క్రీన్లను మూసేయాలనే నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది. సరైన సినిమాలు లేకపోవడం, ఐపీఎల్ సీజన్, ఎన్నికల వేడి వల్ల ప్రేక్షకులు రావడం తగ్గించేశారని, దీని వల్ల కనీస నిర్వహణ ఖర్చులు రాక భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని థియేటర్ల అసోసియేషన్ పేర్కొంది. ఈ శుక్రవారంతో మొదలుపెట్టి మే 30 దాకా ఇది అమలులో ఉంటుంది. ఖచ్చితంగా పాటించాలనే రూల్ లేకపోయినా అధిక శాతం స్వచ్చందంగా ఇందులో పాలు పంచుకుంటారని డిస్ట్రిబ్యూటర్ వర్గాలు అంటున్నాయి. అసలు ముప్పు ముందుంది.
ఒకరకంగా చెప్పాలంటే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు జారీ చేసే తరహాలో దీన్ని మొదటి హెచ్చరికగా తీసుకోవాలి. బహుళ అంతస్థుల భవనంలో ఎక్కడో నాలుగో అయిదో ఫ్లోర్ లో పెట్టే మల్టీప్లెక్సుల కన్నా సింగల్ స్క్రీన్ల మెయింటెనెన్స్ చాలా కష్టం. ఎందుకంటే భూమి విలువ, దాని మీద వచ్చే ఆదాయం లెక్కలో చూసుకుంటే యజమానులు నష్టాలను భరిస్తూ కేవలం ప్యాషన్ మీద వీటిని కొనసాగిస్తూ ఉంటారు. మొత్తంగా పడగొట్టి ఏ కల్యాణ మండపంగానో లేదా షాపింగ్ మాల్ గానో మారిస్తే లక్షల స్థానంలో కొన్ని కోట్ల రూపాయలు కళ్లజూసే అవకాశం ఉంటుంది. అయినా సరే చలించని వారు ఎందరో.
ఇప్పుడీ పరిణామం ఎగ్జిబిటర్లను ఆలోచనలో పడేస్తుంది. మానసిక సంతృప్తి తప్ప ఆర్థిక లబ్ది లేని సింగల్ స్క్రీన్లను నడపడం వల్ల తమ కుటుంబాల్లోని తర్వాతి తరాలకు భారీ ఆస్తులు ఇవ్వలేకపోతున్నామనే అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. ఇదే జరిగితే అమ్మడమో లేదా లీజుకు ఇవ్వడమో చేస్తారు. రెంటల్ పద్ధతిలో నిర్మాతలు ఇచ్చే అద్దెలు సైతం పెరిగిన ధరలకు అనుగుణంగా లేవు. ఒకవేళ నెలకు కనీసం ఒక్కటైన స్టార్ హీరో రిలీజ్ ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదేమో కానీ అలా సాధ్యం కాకపోవడం డ్యామేజ్ ని ఇంకా పెంచింది. గణనీయంగా తగ్గిపోయిన ఒంటరి హాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది.
This post was last modified on May 15, 2024 4:31 pm
జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ మీద ఎంత స్థాయి బజ్ ఉందనేది పక్కనపెడితే పోటీ రూపంలో తలెత్తున్న…
శివమణి సినిమా గుర్తుందా. అందులో నాగార్జున ఫోన్ నెంబర్ గా కొన్ని అంకెలను క్యాప్షన్ గా పెడితే దాన్ని సొంతం…
తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అచ్చమైన తెలుగు సినిమా తీయాలంటే ఇప్పుడు ఆయన తర్వాతే…