Movie News

అదే కథ.. టాక్ ఉంది కలెక్షన్లు లేవు

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఈసారి వేసవిలో పెద్ద సినిమాలు లేకపోవడం పెద్ద మైనస్ కాగా.. అందుబాటులో ఉన్న చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చూసేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కొన్ని వారాల నుంచి సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి.కానీ జనం పట్టించుకోవడం లేదు. ‘టిల్లు స్క్వేర్’ మినహా ఏ చిత్రం కూడా మంచి ఫలితాలను అందుకోలేకపోయింది ఈ వేసవిలో. కొన్ని చిత్రాలకు మంచి టాక్ ఉన్నా సరే.. కలెక్షన్లు రాని పరిస్థితి.

గత వారం సుహాస్ మూవీ ‘ప్రసన్న వదనం’కు ఉన్నంతలో మంచి టాకే వచ్చింది. రివ్యూలు బాగున్నాయి. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది. అయినా సరే.. థియేటర్లకు జనం రాలేదు. ఓవైపు ఐపీఎల్, ఇంకోవైపు ఎన్నికల హడావుడిలో మునిగిపోయిన జనాలు థియేటర్లకు రావడం లేదు.

ఈ వారం నాలుగైదు సినిమాలు రిలీజయ్యాయి కానీ.. అందులో ప్రేక్షకుల దృష్టిని కొంత ఆకర్షించింది కృష్ణమ్మ, ప్రతినిధి-2 చిత్రాలే. వీటిలో ‘ప్రతినిధి-2’కు సరైన టాక్ రాలేదు. జనాలు ముందే దీన్ని లైట్ తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక ‘కృష్ణమ్మ’ విషయానికి వస్తే ఇది పర్ఫెక్ట్ మూవీ కాదు కానీ.. మంచి ప్రయత్నమే. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసు చుట్టూ ఒక కల్పిత కథను అల్లుకుని ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా సినిమా తీశాడు కొత్త దర్శకుడు గోపాలకృష్ణ.

ఈ సినిమాకు ఎబోవ్ యావరేజ్ రివ్యూలు వచ్చాయి. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. కానీ టాక్‌లో ఉన్న పాజిటివిటీ కలెక్షన్లలో ప్రతిఫలించడం లేదు. తొలి రోజు చాలా వరకు థియేటర్లు ఖాళీగానే కనిపించాయి. రెండో రోజు సినిమా కొంచెం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కానీ ఎన్నికల హడావుడి పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో సోమవారం వరకు జనాలు థియేటర్లకు కదలడం కష్టమే. కానీ కీలకమైన వీకెండ్లో వసూళ్లు లేకుంటే సినిమా అన్యాయం అయిపోయినట్లే.

This post was last modified on May 11, 2024 5:53 pm

Share

Recent Posts

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

7 minutes ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

2 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

3 hours ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

3 hours ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

3 hours ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

5 hours ago