Movie News

బ్రహ్మరథం బన్నీకా.. వైసీపీకా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. రెండు రోజుల కిందటే బన్నీ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ట్వీట్ వేసి రాబోయే ఎన్నికల్లో ఆయన కోరుకున్న విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ ట్వీట్ జనసైనికులకు, మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. కొన్ని కారణాల వల్ల మెగా అభిమానుల్లో ఒక వర్గం బన్నీని కొన్నేళ్లుగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ ఎన్నికల సమయంలో బన్నీ.. పవన్‌కు మద్దతుగా ట్వీట్ వేయడాన్ని అందరూ స్వాగతించారు. కానీ రెండు రోజులు గడిచేసరికే కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది.

తనకు, తన భార్య స్నేహారెడ్డికి మిత్రుడైన శిల్పా రవి కోసమని బన్నీ.. నంద్యాలకు వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదని.. బన్నీ తన మిత్రుడికి అండగా నిలిచేందుకే వచ్చాడు తప్ప వైసీపీకి సపోర్ట్ ఇవ్వడానికి కాదని ఆయన మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఏ రకంగా అయినా సరే.. బన్నీ వైసీపీ కోసం ప్రచారంలో పాల్గొనాల్సింది కాదని.. కావాలంటే తన మిత్రుడికి మద్దతుగా ఒక పోస్ట్ పెట్టి ఊరుకోవాల్సిందనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు, జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బన్నీని ట్రోల్ చేస్తున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉండగా.. శిల్పా రవికి మద్దతుగా బన్నీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వైసీపీ మద్దతుదారులు కొనియాడుతున్నారు.

బన్నీ పవన్ కోసం కేవలం ట్వీట్ మాత్రమే వేశాడని.. కానీ వైసీపీ క్యాండిడేట్ కోసం నేరుగా ఎన్నికల ప్రచారంలోనే పాల్గొన్నాడని.. దీన్ని బట్టి తన ప్రయారిటీ ఎవరికి అన్నది అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నంద్యాలలో బన్నీని చూసేందుకు అభిమానులు, జనం పోటెత్తారు. దీన్ని వైసీపీ క్యాండిడేట్‌కు ఎలివేషన్ ఇవ్వడానికి ఆ పార్టీ వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. కానీ బన్నీని చూసేందుకు వచ్చిన జనాన్ని చూపించి వైసీపీకి అంతా బాగుందని చెప్పుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ఇంతకీ బన్నీ మద్దతు ఇచ్చిన క్యాండిడేట్‌కు ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

This post was last modified on May 11, 2024 5:57 pm

Share

Recent Posts

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

1 hour ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

2 hours ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

2 hours ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

2 hours ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

4 hours ago

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

8 hours ago