కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21 ఎఫ్, ఉయ్యాలా జంపాల లాంటి హిట్లున్నప్పటికీ వాటికి నిలబెట్టుకునే స్థాయిలో తర్వాత సినిమాలు పడలేదు. చాలా మటుకు ఫ్లాపులే కాగా డిజిటల్ రైట్స్ పుణ్యమాని కొన్ని గట్టెక్కాయి. సరే సపోర్టింగ్ రోల్స్ కి మారి చూద్దామని నాగార్జున నా సామిరంగాలో నటిస్తే దాని వల్ల ప్రయోజనం కలగలేదు. క్రెడిట్ నాగ్, అల్లరి నరేష్ లు పంచుకున్నారు. అందుకే సోలో హీరోగా రాజ్ తరుణ్ మూవీ అంటే థియేట్రికల్ గా రిస్కని ఫీలవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది.
తనవి రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మొదటిది తిరగబడరా సామీ. ఎప్పుడో పది నెలల క్రితం టీజర్, లిరికల్ వీడియోలు వచ్చేశాయి. కానీ అసలు రిలీజ్ మాత్రం జరగలేదు. సరైన డేట్ దొరక్కపోవడంతో పాటు బిజినెస్ డీల్స్ పూర్తి కాకపోవడం వల్ల ఆపేస్తూ వచ్చారు. పైగా ఎప్పుడో ఫామ్ కోల్పోయిన యజ్ఞం ఫేమ్ రవికుమార్ చౌదరి దర్శకుడు కావడం ఎలాంటి ప్లస్ కాలేకపోయింది. ఈలోగా భలే ఉన్నాడే అనే మూవీ రెడీ అయిపోయింది. నిన్న టీజర్ వచ్చింది. అమ్మాయిలకు చీరలు కట్టే వెరైటీ ఉద్యోగం చేసే అబ్బాయిగా రాజ్ తరుణ్ తో ఏదో ప్రయోగం చేయించారు.
మారుతీ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆయన పర్యవేక్షణలోనే జరిగి ఉంటుంది. భలే భలే మగాడివోయ్ ఫ్లేవర్ గుర్తొచ్చేలా దానికి అనుగుణంగానే పేరు పెట్టారు. దీనికి సమస్యలు లేవు. నాన్ థియేట్రికల్. ఓటిటి అమ్మేశారు. రీజనబుల్ బడ్జెట్ కాబట్టి తక్కువ బ్రేక్ ఈవెన్ తో దిగితే ఈజీగా సేఫ్ అయిపోతుంది. హిట్ టాక్ వస్తే లాభాలు ఖాయం. ఈ లెక్కలన్నీ వేసుకునే భలే ఉన్నాడేని దించుతున్నారు. ఇది తిరగబడరా సామికి ఉపయోగపడుతుంది. పెద్ద బ్రేక్ వస్తే మళ్ళీ ఊపందుకోవాలని చూస్తున్న రాజ్ తరుణ్ కి చాలా భవిష్యత్ ఉంది. అందుకే ఇవి సక్సెస్ కావడం చాలా కీలకం.
This post was last modified on May 6, 2024 5:54 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…