కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన దగ్గర్నుంచీ ‘నేను సినిమా రిలీజ్ చేసేస్తా… చేసేస్తా’ నంటూ తొందర పడిపోయాడు బాలీవుడ్ విఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నొలాన్. తన సినిమా ‘టెనెట్’ చూడ్డానికి కరోనాను లెక్క చేయకుండా జనం వచ్చేస్తారని నొలాన్ కాన్ఫిడెన్స్. అందుకే పరిస్థితులు బేరీజు వేసుకోకుండా టెనెట్ థియేటర్లలో విడుదల చేసేసారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి యుఎస్‍లో దారుణ పరాభవం ఎదురయింది.
అక్కడ కేవలం ముప్పయ్ మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనినిబట్టి కరోనా టైమ్‍లో థియేటర్లకు వెళ్లడానికి జనం ఎంత జంకుతున్నారనేది తేటతెల్లమయింది. ఇండియాలో కూడా థియేటర్లు తెరవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. థియేటర్లు తెరిచేస్తే జనం వచ్చేస్తారని అనుకుంటే టెనెట్ పరిస్థితే వస్తుంది. అందులోను తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ చాలా కీలకం.
అక్కడ ఇప్పట్లో జనం ధైర్యం చేసి పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. టెనెట్ రిజల్ట్ చూసిన తర్వాత త్వరలో విడుదల చేద్దామని అనుకున్న పలు హాలీవుడ్ చిత్రాలను కూడా డిసెంబర్‍కి, వచ్చే వేసవికీ వాయిదా వేసేసారు.
This post was last modified on September 17, 2020 1:35 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…