ఈసారి రామ్ చరణ్‌ చెల్లెలుగా రానుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ మూవీ ‘ఆచార్య’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగా తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని స్వయంగా చిరంజీవి ప్రకటించారు.

‘ఆచార్య’ కోసం రాజమౌళిని ఒప్పించి మరీ నెలరోజుల పాటు చరణ్ డేట్స్ తీసుకున్నాడట చిరూ. సోషియో- పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో యంగ్ ఏజ్‌లో ఉన్న చిరంజీవిగా కనిపిస్తాడని టాక్. ఇప్పుడు ఈ మూవీలో మరో మెగా వారసురాలు కూడా కనిపించబోతుందని సమాచారం.

మెగా కుటుంబం నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కూతురు కొణిదెల నిహారిక, ‘ఆచార్య’ మూవీలో అతిథి పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్‌కి చెల్లిగా నిహారిక కనిపిస్తుందని, అన్నాచెల్లెల ఎపిసోడ్ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందని అంటున్నారు. చిన్న పాత్రే అయినా కథను మలుపు తిప్పే పాత్రలో నిహారిక నటిస్తోందని సమాచారం. అయితే ఈ వార్త నిజం కాకూడదని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే నటిగా నిరూపించుకున్నప్పటికీ నిహారిక ఇప్పటిదాకా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేదు. మెగా డాటర్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

అంతెందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘సైరా’లో ఓ చిన్న పాత్రలో కనిపించింది నిహారిక. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. అందుకే ఒకవేళ ‘ఆచార్య’ రిజల్ట్ తేడాకొడితే, దానికి నిహారికనే బాధ్యురాలిని చేస్తారని… మెగా డాటర్ సరైన సక్సెస్ అందుకునేదాకా ఇలాంటి రోల్స్‌కు దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.