లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం కోడై కూస్తున్నా నిర్మాణ సంస్థ లైకా మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఉండటం అభిమానుల్లో అసహనం పెంచుతోంది. కేవలం నలభై రోజుల్లో రిలీజ్ పెట్టుకుని అసలు ప్రమోషన్ల ఊసే లేకుండా మౌనంగా ఉన్న వైనం విస్మయం కలిగిస్తోంది. కొంపదీసి మళ్ళీ వాయిదా పడిందేమోననే అనుమానాలు తలెత్తుతుంటే మే మూడో వారంలో చెన్నై వేదికగా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఉంటుందనే వార్త జోరుగా తిరుగుతోంది. రజని, చరణ్ గెస్టులుగా వస్తారట.
దర్శకుడు శంకర్ ఏ విషయాన్నీ తేల్చకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని ఇండస్ట్రీ టాక్. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ పనులు జరుగుతున్నాయని, కొన్ని ప్యాచ్ వర్క్స్ పట్ల పూర్తి సంతృప్తి చెందకపోవడం వల్ల వాటిని సరిచేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇంకోవైపు కమల్ ఫ్యాన్స్ ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి పబ్లిసిటీ చాలా అవసరమని, ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే తప్ప బజ్ రాదని వాపోతున్నారు. హైప్ లేకపోవడం వల్లే బాలీవుడ్ వెర్షన్ కు ఆశించిన స్థాయిలో రేట్ పలకలేదని వాళ్ళ వాదన. 1996లో ఫస్ట్ పార్ట్ హిందీ డబ్బింగ్ హిందుస్థానీ నార్త్ లో చాలా పెద్ద హిట్టు.
కల్కి 2898 ఏడి జూన్ 27 విడుదలవుతుంది కాబట్టి కేవలం రెండు వారాల గ్యాప్ తో భారతీయుడు 2 సర్దుకోవాల్సి వస్తుంది. ఇంత తక్కువ థియేట్రికల్ రన్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే కల్కి వచ్చేనాటికి ఇండియన్ ని పూర్తిగా తీసేస్తారు. హిట్ టాక్ తో నడుస్తున్నా సరే స్క్రీన్ కౌంట్ గణనీయంగా పడిపోతుంది. ఇంకో ఆందోళన కలిగించే విషయం ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన భారతీయుడు 2కి కనీసం ఆ అంశం కూడా పాజిటివ్ గా కనిపించడం లేదు. అసలు ఇంత నిర్లిప్తంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటో శంకర్ బృందానికే ఎరుక.
This post was last modified on May 3, 2024 1:57 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…