టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు కదా షూటింగులు చేసుకుంటూనే ఇంకో వైపు టిల్లు క్యూబ్ కు సంబంధించిన పనులు చూసుకుంటున్నాడు. దర్శకుడి ప్రకటన ఇంకా జరగనప్పటికీ మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ కు ఆ బాధ్యతలు ఇస్తారనే లీక్ ఆల్రెడీ వచ్చేసింది. ఇదిలా ఉండగా ఈ మూడో భాగంలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డేని తీసుకునే ఆలోచన జరుగుతున్నట్టు ఇన్ సైడ్ లీక్. ఖరారు కాలేదు కానీ ప్రాధమికంగా ఎలా ఉంటుందనే ప్రతిపాదన గురించి సీరియస్ గా చర్చిస్తున్నట్టు తెలిసింది.
నిజానికి పూజా హెగ్డే ఫామ్ లో లేదు. నిన్న ఏడాది సౌత్ లో ఒక్క రిలీజ్ జరిగితే ఒట్టు. హిందీలో సల్మాన్ సరసన కిసీకా భాయ్ కిసీకా జాన్ చేస్తే అది అల్ట్రా డిజాస్టర్ అయ్యింది. గుంటూరు కారం కొంత భాగం షూటింగ్ చేశాక వదులుకోవాల్సి వచ్చింది. 2022లో అన్నీ సూపర్ ఫ్లాపులే. అయినా సరే సిద్దు మొగ్గు చూపడం వెనుక ఒక స్ట్రాటజీ ఉందంటున్నారు. టిల్లు స్క్వేర్ కి అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకునే టైం చాలా కామెంట్స్ వచ్చాయి. అవకాశాలు తగ్గిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి వర్కౌట్ చేస్తారాని. తీరా చూస్తే లిల్లీగా పాత్రలో ఒదిగిపోవడమే కాదు గ్లామర్ డోస్ తో కూడా మెప్పించింది.
సో పూజా హెగ్డే ఎంత మాత్రం రాంగ్ ఛాయస్ కాకపోవచ్చు. అధికారిక ప్రకటన లేదు కనక నిర్ధారణగా చెప్పలేం కానీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డే ముంబైలోనే మకాం పెట్టినా మనసు హైదరాబాద్ మీద కూడా ఉంది. నాగ చైతన్యతో ఒక సినిమా ఓకే కావొచ్చనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో క్రమంగా దర్శకుల చూపు తన మీద పడ్డట్టే కనిపిస్తోంది. మరి టిల్లు ఫైనల్ గా ఏం చేస్తాడో చూడాలి. హీరోయిన్ కొరత ఉన్న టైంలో ఎవరు ఏ రూపంలో హిట్టు కొట్టి ట్రాక్ లోకి వస్తారో ముందే చెప్పలేం. సో బుట్టబొమ్మకి నిజంగా ఇవి ఓకే అయితే మాత్రం అభిమానులకు పెద్ద ఊరట.
This post was last modified on May 2, 2024 6:31 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…