Movie News

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా ఆయన తీసిన పలు చిత్రాలు సంచలనం రేపాయి. ఐతే తర్వాత తర్వాత సరైన సినిమాలు పడక.. వరుస ఫెయిల్యూర్ల వల్ల ఆయన జోరు తగ్గిపోయింది. కొన్నేళ్ల పాటు అసలు సినిమాలే ప్రొడ్యూస్ చేయకుండా సైలెంట్‌గా ఉన్న రత్నం.. మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆయన ‘హరి హర వీరమల్లు’ లాంటి భారీ చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య మొదలైన ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. కానీ ఈ చిత్రం అనుకున్న సమయానికి పూర్తి కాక.. షూట్ మధ్యలో ఆగిపోయి.. ఎంతకీ పున:ప్రారంభం కాక.. ఎప్పుడు రిలీజవుతుందో తెలియక రత్నం చాలా ఇబ్బంది పడుతున్నాడు.

దాదాపు రెండొందల కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా ఇంత కాలం ఆగితే.. వడ్డీల భారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. దీని వల్ల ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోతోంది. కానీ పవన్ కళ్యాణ్‌కు ఉన్న వేరే సినీ, రాజకీయ కమిట్మెంట్ల వల్ల దీనికి బల్క్ డేట్లు ఇవ్వలేక సినిమా పూర్తి కావట్లేదు. దీంతో రత్నం మీద ఆర్థిక భారం బాగా పెరిగిపోయింది. ఇలాంటి టైంలో ఆయనకు రెండు దశాబ్దాల కిందట ప్రొడ్యూస్ చేసిన ‘గిల్లి’ సినిమా కొంత ఊరటనిచ్చింది.

ఈ చిత్రాన్ని ఇటీవలే రీ రిలీజ్ చేశారు. ఇలా స్టార్ హీరోల పాత సినిమాలను రిలీజ్ చేస్తే రెండు మూడు కోట్లో.. మహా అయితే ఐదు కోట్లో కలెక్షన్ రావడం మామూలే. కానీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఏకంగా పాతిక కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. రీ రిలీజ్ హక్కులు, కలెక్షన్ల వాటా రూపంలో ఆయనకు మంచి ఆదాయమే వచ్చింది. కష్ట కాలంలో ఈ సినిమా ఆయనకు కొంత ఊరటనిచ్చిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on May 1, 2024 11:34 pm

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

37 minutes ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

3 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

3 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

4 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

5 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

5 hours ago