Movie News

పదిహేనేళ్ల మాట తీర్చిన SSMB 29

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్ కాకుండానే పలు ఆసక్తికరమైన సంగతులు బయటికి వస్తున్నాయి. దీన్ని నిర్మిస్తున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కెఎల్ నారాయణ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. నిజానికీ కలయిక 15 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకున్నది. అంటే బాహుబలి కన్నా ముందు, జక్కన్న కమర్షియల్ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్లు కొడుతున్న టైంలో ఒప్పుకున్నది. కానీ ఏవేవో కారణాల వల్ల వాయిదా పడగా, ఈలోగా రాజమౌళి పేరు ప్రపంచస్థాయికి చేరుకోవడం జరిగిపోయింది.

అయినా సరే ఇచ్చిన మాట కోసం కట్టుబడిన మహేష్ బాబు, రాజమౌళిలు ఇంత ఆలస్యమైనా సరే దుర్గా ఆర్ట్స్ కే సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో నారాయణ ఆశ్చర్యపోయారు. ఇలాంటి పరిస్థిత్తుల్లో మాములుగా కొందరు ఇచ్చిన అడ్వాన్స్ వడ్డీతో సహా వెనక్కు ఇచ్చేసి హమ్మయ్య అనుకుంటారు. అందులోనూ మార్కెట్ రేంజ్ వందల కోట్లు దాటిపోయాక ఇంత కంటే వేరే ఆప్షన్ పెట్టుకోరు. కానీ అలా చేస్తే నైతికత ఎక్కడ ఉన్నట్టు. అందుకే ఇద్దరూ ఒకే మాటకు కట్టుబడి ప్రొడక్షన్ కి దూరంగా ఉన్న నారాయణ. గోపాల్ రెడ్డిలను ఒప్పించి మరీ ప్రాజెక్టు పట్టాలు ఎక్కేలా చూశారు.

ఒకప్పుడు హలో బ్రదర్, క్షణ క్షణం, దొంగాట లాంటి బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్స్ ఇచ్చిన శ్రీ దుర్గా ఆర్ట్స్ కి ఇది చాలా ప్రతిష్టాత్మక చిత్రంగా మారనుంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 ప్రారంభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తుండగా హీరోయిన్ తో సహా ఇతర క్యాస్టింగ్ ఎవరుంటారనే వివరాలు ఇంకా బయటికి చెప్పడం లేదు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చాక చేస్తున్న రాజమౌళి సినిమా కావడంతో అంతర్జాతీయ కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంకొద్ది రోజులు ఆగితే అన్నింటి సస్పెన్స్ పూర్తిగా తీరిపోనుంది. 

This post was last modified on May 1, 2024 11:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పొలిటిక‌ల్ ఐపీఎస్‌లు.. ప్ర‌జ‌లు స్వాగ‌తించారా ..!

రాజ‌కీయాల్లోకి అఖిల భార‌త ఉద్యోగులు రావ‌డం స‌హ‌జం అయిపోయింది. ఉద్యోగాలు విర‌మ‌ణ చేసిన వారు కొంద‌రు.. మ‌ధ్య‌లోనే పీక్ స్టేజ్‌లో…

40 minutes ago

సందీప్ వంగాతో రామ్ చరణ్ – నిజమా ?

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అనే లవకుశ పాట టాలీవుడ్ కు అచ్చంగా సరిపోతుంది. కొన్ని కాంబినేషన్లు రూపొందే…

57 minutes ago

జాంబీ రెడ్డి 2 కోసం వంద కోట్ల బడ్జెట్ ?

దర్శకుడు ప్రశాంత్ వర్మకి హనుమాన్ కన్నా ముందు కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చిన సినిమా జాంబీ రెడ్డి. అప్పటిదాకా టాలీవుడ్…

3 hours ago

సార్ దర్శకుడికి సూపర్ ఆఫర్స్

ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రూపంలో ఒక్కసారి బ్రేక్ దక్కిందంటే ఆ దర్శకుడి సుడి మాములుగా తిరిగదు. వెంకీ అట్లూరి పరిస్థితి…

3 hours ago

విచార‌ణ‌కు రండి..: సాయిరెడ్డికి నోటీసులు

"విచార‌ణ‌కు రండి. ఈ నెల 18న హాజ‌రై మాకు స‌హ‌క‌రించండి. వ‌చ్చేప్పుడు మీ వ‌ద్ద ఉన్న ఆధారాలు వివ‌రాలు కూడా…

4 hours ago

2న అమరావతికి మోదీ.. రాజధాని పనుల పున:ప్రారంభం

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన…

4 hours ago