Movie News

ఓవర్ చేశానని ఒప్పుకున్న స్టార్ హీరో

డిజాస్టర్లు ఏ హీరోకైనా సహజం. ఇవి తప్పించుకున్న దర్శకులు ఉంటారేమో కానీ నటులు మాత్రం ప్రపంచంలోనే ఉండరు. కాకపోతే ఓటమిని స్వీకరించి అంగీకరించే ధైర్యం అందరికీ సులభం కాదు. అమీర్ ఖాన్ ని ఈ విషయంలో ప్రత్యేకంగా మెచ్చుకోవచ్చు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఒక కామెడీ షోకి గెస్టుగా వచ్చిన ఈ వర్సటైల్ యాక్టర్ ఇంటర్వ్యూలో భాగంగా లాల్ సింగ్ చద్దా ప్రస్తావన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం మూటగట్టుకున్న ఈ ఎమోషనల్ డ్రామా హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ రీమేకన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాని గురించి ఓపెనయ్యాడు.

లాల్ సింగ్ చద్దాలో తన పెర్ఫార్మన్స్ కొంచెం అతిగా అనిపించిన మాట వాస్తవమేనని, పాత్రని అమితంగా ప్రేమించడం వల్ల తాను చేస్తోంది రైటో రాంగో చెక్ చేసుకోలేదని, దాని వల్ల స్క్రీన్ మీద తన నటన కృతకంగా అనిపిస్తే తప్పేం లేదని ఒప్పుకున్నాడు. 3 ఇడియట్స్ లో రాంచో క్యారెక్టర్ కి ఎలాగైతే మురుగదాస్ నుంచి స్ఫూర్తి పొందానో, చద్దాకు కూడా అదే తరహా కొత్తదనాన్ని జోడించబోయే బోల్తా పడ్డానని చెప్పాడు. ఫలితం ఏదున్నా నిర్మాతకు నష్టం రావడం అన్నింటికన్నా బాధ కలిగిస్తుందని అన్నాడు. దీంతో అక్కడికొచ్చిన ఫ్యాన్స్ ఒక్కసారిగా చప్పట్లతో ప్రశంసించారు.

నేను అతి చేశానని చెప్పడం నిజంగా అమీర్ లాంటి పెద్ద హీరోకు అవసరం లేదు. అయినా సరే ఎలాంటి మొహమాటం పడటం లేదు. ప్రస్తుతం సితారే జమీన్ పర్ చేస్తున్న ఈ సీనియర్ స్టార్ మరో రెండు సినిమాల్లో క్యామియోలు పోషిస్తున్నాడు. కమర్షియల్ కథల జోలికి వెళ్లే ప్రసక్తే లేదంటున్న అమీర్ తన కో స్టార్స్ షారుఖ్, సల్మాన్ లా టైగర్, పఠాన్ లాంటివి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అమీర్ ఖాన్ మాత్రం ప్రయోగాలకే మొగ్గు చూపుతున్నాడు. అన్నట్టు లాల్ సింగ్ చద్దా ఒక్క తనకే కాదు మన నాగ చైతన్యకు సైతం మర్చిపోలేని బ్యాడ్ బాలీవుడ్ డెబ్యూగా మిగిలిపోయింది. 

This post was last modified on May 1, 2024 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago