లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి.. గత ఏడాది పున:ప్రారంభమై ఈ మధ్యే పూర్తయిన ‘ఇండియన్-2’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కమల్ అండ్ టీం ప్రయత్నిస్తోంది. ఈ చిత్రం జూన్‌లో రిలీజవుతుందని కొన్ని రోజుల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇండియన్-2 పాన్ ఇండియా సినిమా కాబట్టి పోటీ లేకుండా.. మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయాలి. ఐతే ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్న జూన్ నెలలోనే ‘కల్కి 2898 ఏడీ’ లాంటి భారీ చిత్రం రాబోతోంది. ఆ చిత్రానికి జూన్ 27ను రిలీజ్ డేట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి దానికి సమీపంలో ‘ఇండియన్-2’ను రిలీజ్ చేయడం కష్టం.
‘కల్కి’ మీద ఉన్న భారీ అంచనాల దృష్ట్యా కూడా ముందు వారం ‘ఇండియన్-2’ను రిలీజ్ చేయడానికి అవకాశం లేదు. జూన్ ఆరంభంలో సినిమాలకు అంతగా కలిసి రాదు. ఇక మిగిలిన ఆప్షన్ జూన్ 13న రిలీజ్ చేసుకోవడమే. నిజానికి అప్పుడే స్కూళ్లు, కాలేజీలు మొదలవుతాయి కాబట్టి ఆ హడావుడిలో సినిమాను విడుదల చేయడం కూడా అంత మంచిది కాదనే అభిప్రాయం ఉంది.
కానీ దానికే ఫిక్సవక తప్పేలా లేదు. జూన్ నెలాఖర్లో వస్తే సినిమాకు ప్లస్ అయ్యేది. రిలీజ్ గురించి ప్రకటించినపుడే డేట్ లాక్ చేసుకుని ఉంటే బాగుండేదేమో. అప్పుడు జస్ట్ జూన్ నెల అన్నారు. ఇప్పుడు నెలాఖరుకు ‘కల్కి’ ఫిక్స్ అయింది. దీంతో అంతగా అనుకూలంగా లేని డేట్‌ను ‘ఇండియన్-2’ కోసం ఓకే చేయాల్సి వస్తోంది. త్వరలోనే ఇండియన్-2 టీం అధికారికంగా ఈ తేదీని ప్రకటించబోతోందట.
This post was last modified on April 30, 2024 7:34 pm
సినీ రంగంలో హీరోలకు భారీగా పారితోషకాలు ఇస్తారు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్.…
గోరంట్ల మాధవ్. 2022లో జోరుగా వినిపించిన పేరు. హిందూపురం వైసీపీ ఎంపీగా అప్పట్లో ఆయన న్యూడ్ వీడియో ఆరోపణల తో…
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే అందుకోసమే కొందరు భామలుండేవారు. వాళ్లే ఆ పాటలు చేసేవారు. కానీ గత దశాబ్ద కాలంలో…
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…