సినిమా విడుదల ప్లానింగ్ సమయంలో పోటీ ఎంత ఉందనేది చూసుకోవడం చాలా ముఖ్యం. ఊరికే డేట్ వేసుకున్నామని తొందరపడితే బ్రేక్ ఈవెన్ దేవుడెరుగు కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కూడా కష్టమవుతుంది. సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న కృష్ణమ్మ ఈ విషయంలో తెలివిగా వ్యవహరించింది. ముందు అధికారికంగా ప్రకటించిన మే 3 నుంచి తప్పుకుని మే 10కి వెళ్లిపోయింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కొరటాల శివ నిర్మాణ భాగస్వామ్యంతో వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఇది రూపొందింది. వాయిదా వెనుక కొన్ని ఆసక్తికరమైన సంగతులున్నాయి.
మే 3న సుహాస్ ప్రసన్నవదనం మంచి అంచనాలతో రిలీజవుతోంది. దాన్ని పంపిణి చేస్తోంది మైత్రి మేకర్స్. ఇదే సంస్థ కృష్ణమ్మ బాధ్యతలు తీసుకుంది. రెండూ మీడియం రేంజ్ సినిమాలు. కంటెంట్ పరంగా ఎవరి ధీమా వారికున్నా థియేటర్ల దగ్గర ఒకరకమైన స్లంప్ వాతావరణం ఉన్న టైంలో ఇలాంటి క్లాష్ ఎంత మాత్రం సేఫ్ కాదు. పైగా మాడిపోయే ఎండలు, ఐపీఎల్ క్రికెట్, ఎన్నికలు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రెండు ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేయడం పెద్ద ఇబ్బందేం కాదు కానీ కృష్ణమ్మకు కాంపిటీషన్ కేవలం ఆ ఒక్క ప్రసన్నవదనంతోనే ఆగిపోలేదు.
అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మీద హైప్ క్రమంగా పెరుగుతోంది. దీన్ని తక్కువంచనా వేయడానికి లేదు. తమన్నా, రాశిఖన్నాలు ప్రధాన పాత్ర పోషించిన బాక్ అరణ్మయి 4 కోసం హారర్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇది డబ్బింగ్ అయినప్పటికీ మాస్ ఆడియన్స్ మద్దతు దొరికే అవకాశాలు కొట్టిపారేయలేం. అసలే సత్యదేవ్ కు సోలో హీరోగా మార్కెట్ తగ్గిపోయింది. తనకోసమే వచ్చే ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ డే ఫిగర్స్ కి వాళ్ళు సరిపోరు. అలా కాకుండా సింగల్ గా రావడం వల్ల మౌతా టాక్ తో జనాన్ని మెల్లగా రప్పించుకోవచ్చు. ఇంటెన్స్ డ్రామాగా రూపొందిన కృష్ణమ్మకు సంగీతం కాలభైరవ.
This post was last modified on April 26, 2024 6:31 pm
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…