సమంత త్వరలో అఫీషియల్‍గా బాలీవుడ్‍లో అడుగు పెడుతోంది. హిందీ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2లో నటించిన సమంత ఇంతవరకు హిందీ సినిమా ఒక్కటీ చేయలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలలో రూపొందనుంది. ఇదే దర్శకుడు ఇంతకుముందు తాప్సీతో ‘గేమ్ ఓవర్’ సినిమా తీసాడు. అందులో తాప్సీ చక్రాల కుర్చీకి పరిమితమయ్యే పాత్రలో కనిపించింది. సమంత నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ మ్యూట్ అట. సమంత ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి.
ఇటీవల సినిమాలు తగ్గించేసిన సమంత పాత్ర చాలా స్పెషల్ అనిపిస్తే తప్ప ఓకే చేయడం లేదు. నటిగా తన ప్రతిభ ఏమిటనేది సమంత ఇటీవల ప్రతి సినిమాతోను చాటుకుంటోంది. ఇక నటనకు అవకాశమున్న ఇలాంటి పాత్ర అయితే ఆమె ఏ స్థాయిలో మెప్పించగలదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అక్టోబర్‍లో రిలీజ్ అవుతుంది కనుక ఈ చిత్రం విడుదలయ్యే నాటికి సమంతకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చేస్తుంది. బహుశా అందుకే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారేమో.
ఇకపోతే ఇటీవల సమంతతో సినిమా చేయాలని ప్రయత్నించిన ఇద్దరు దర్శకులు చెప్పిన కథలు విని సమంత రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కాంబినేషన్‍లో సినిమా పట్ల కూడా సమంత ఆసక్తి చూపించలేదట. మజిలీలాంటి ప్రత్యేకత వుందనిపిస్తే తప్ప తమ జంట కలిసి నటించకూడదని డిసైడ్ అయ్యారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates