ప్రొడ్యూసర్‍ రెడీ.. హీరో దొరకాలి

మారుతి అంత పెద్ద విజయం అందించినా కానీ అందరు ప్రముఖ హీరోలు ఏదో ఒక సినిమాతో బిజీగా వుండడంతో ఇంకా అతని మలి చిత్రానికి హీరో సెట్‍ కాలేదు. దీంతో ఈలోగా మారుతి తన ప్రొడక్షన్‍ హౌస్‍ని మళ్లీ స్టార్ట్ చేసి ఓటిటిల కోసం సినిమాలు నిర్మించే ఆలోచనలో వున్నాడు. సోలో ప్రొడక్షన్‍ కాకుండా ఇతర ప్రొడ్యూసర్లతో కలిసి మారుతి ఇదంతా ప్లాన్‍ చేస్తున్నాడు. ఇదిలావుంటే మారుతి మలి చిత్రానికి నిర్మాత ఖరారైపోయినట్టే. యువి క్రియేషన్స్ లో మారుతి మలి చిత్రం వుంటుంది.

ఇప్పటికే రాతపూర్వక ఒప్పందాలు జరిగిపోయాయి. మారుతి దగ్గర కథ కూడా రెడీ అయిపోయింది. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫిక్స్ కావాల్సి వుంది. మారుతి దృష్టిలో రవితేజతో చేయాలని వుందట. రవితేజ ఫ్రీగా వుంటే అతనితో లేదంటే మరెవరైనా యువ హీరోతో చేస్తారట. రామ్‍కి మారుతి వినిపించిన కథ కోసమే ఇప్పుడు రవితేజను కన్సిడర్‍ చేస్తున్నట్టు టాక్‍ వినిపిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్‍ అయితే రవితేజకి ప్లస్‍ అవుతుంది.

వరుస పరాజయాలతో మార్కెట్‍ పూర్తిగా కోల్పోయిన రవితేజ ‘క్రాక్‍’తో బ్రేక్‍ వస్తుందని చూస్తున్నాడు. మారుతితో ఫాలో అప్‍ సినిమా పడితే మరో మినిమం గ్యారెంటీ మూవీ ఖాయం చేసుకోవచ్చు.