ఓటింగ్ ద్వారా గంగవ్వ ఎలిమినేషన్ జరగడం ఇంపాజిబుల్ అనేది ఇప్పటికే స్పష్టమైపోయింది. ఆమెకు సింపతీ కొద్దీ జనం ఓట్లు గుద్దేస్తున్నారు కనుక ఆమె రెగ్యులర్ పద్ధతిలో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఈ సంగతి బిగ్‍బాస్ నిర్వాహకులకు కూడా తెలుసు. మరి ఆమె పదిహేను వారాల పాటు హౌస్‍లో వుండి విజేతగా బయటకు వస్తుందా? పల్లెటూర్లో ఆరు బయట తిరుగుతూ, పొలం పనులు చేసుకుంటూ కాలక్షేపం చేసే వృద్ధురాలికి అలా ఒకే ఇంట్లో అపరిచితులతో అన్ని రోజులుండడం జరిగే పని కాదు.
అందుకే బిగ్‍బాస్ నిర్వాహకులు ఆమెను అయిదు వారాల పాటు వుండాలని చెప్పారట. కానీ మొదటి వారానికే అవ్వకు ఇంటిపై గుబులు మళ్లింది. ఇప్పటికే అక్కడ అన్యమనస్కంగా వుంటూ నాగార్జునతోనే రెండుసార్లు బయటకు పంపుర్రి అంటూ అర్జీ పెట్టుకుంది. సూర్యకిరణ్ వెళ్లిపోతుంటే కూడా తనను పంపేసి అతడిని వుంచమని చెప్పింది. అగ్రిమెంట్ ప్రకారం అయిదు వారాల పాటు గంగవ్వ అక్కడ వుంటుందా అనేది అనుమానమే.
మూడవ వారంలో ఆమె స్వచ్ఛందంగా బయటకు వచ్చే అవకాశముందని వినిపిస్తోంది. ఇదిలావుంటే గంగవ్వను బిగ్‍బాస్ రెగ్యులర్ కంటెస్టెంట్‍గా లెక్కించలేదు. అందుకే మొదటి వారంలోనే ఎక్స్ ట్రా ప్లేయర్‍ను లోపలకు పంపించారు. గంగవ్వ బయటకు వచ్చిన వారంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుందని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates