Movie News

సైరా వల్ల నష్టపోయాం-చిరు

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన చిత్రాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా చేయాలని ఎన్నో ఏళ్ల పాటు కలలు కన్న చిరంజీవి.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ సినిమా చేశారు. ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చాక చిరు చేసిన చిత్రమిది.

సొంత బేనర్లో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో రాజీ లేకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు రామ్ చరణ్. ఆ సమయానికి ఇది చాలా రిస్క్ అనిపించినా.. చిరు డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో చరణ్ రాజీ పడలేదు. ఐతే ఈ సినిమాకు మంచి టాకే వచ్చినా అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు. ఆ టైంకి సినిమాను సూపర్ హిట్ అని ప్రచారం చేశారు కానీ.. దీని వల్ల మెగా ఫ్యామిలీకి నష్టాలు తప్పలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇప్పుడు చిరంజీవే స్వయంగా ‘సైరా’ నష్టాలు మిగిల్చిన విషయాన్ని అంగీకరించారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్‌తో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ‘సైరా’ గురించి చిరు మాట్లాడారు. “ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురుచూసే పాత్రలు ప్రతిసారీ రావు. వాటంతట అవే రావాలి. నాకు స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలని ఉండేది. ‘సైరా’తో ఆ కోరిక తీరింది. కానీ ఆ చిత్రం సంతృప్తికర ఫలితాన్నివ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్‌గా నిలిచింది. మిగతా చోట్ల బాగా ఆడింది. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ జేబు ఖాళీ అవుతుంది. గతంలో ‘రుద్రవీణ’ లాంటి గొప్ప సినిమా చేశాను. చాలా మంచి పేరొచ్చింది. కానీ ఈ సినిమాను నిర్మించిన నా తమ్ముడు నాగబాబుకు డబ్బులు రాలేదు. అందుకే తర్వాత నిర్మాతల బాగు కోసం కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది” అని చిరు చెప్పారు.

This post was last modified on April 13, 2024 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి…

12 minutes ago

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

33 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

58 minutes ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

2 hours ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

3 hours ago