పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తరచుగా ఏదో రకంగా వ్యాఖ్యలు చేస్తుంటుంది పూనమ్ కౌర్. వీరి మధ్య బంధం గురించి ఎన్నో ఏళ్ల నుంచి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే పూనమ్ ఎప్పుడు ఏం మాట్లాడినా అందరూ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. చాలాసార్లు ఇన్ డైరెక్ట్‌గా పవన్ మీద ఎటాక్ చేసింది పూనమ్. ఐతే అప్పుడప్పుడూ పవన్‌కు అనుకూలంగా కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తుంటుంది. కానీ పవన్ పేరు మాత్రం ఎత్తదు. తాజాగా ఆమె మరోసారి పవన్ టాపిక్‌తో వార్తల్లోకి వచ్చింది. ఈసారి ఆమె ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ మీద పంచ్ వేయడానికి పవన్ టాపిక్‌ను వాడుకుంది.
ప్రఖ్యాత టెస్లా కంపెనీ ఇండియాలో ప్లాంట్ పెట్టాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. టెస్లా ఏపీకి రావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక వైసీపీ మద్దతుదారు టెస్లాను ఏపీకి ఆహ్వానిస్తూ ఒక పోస్టు పెట్టాడు.
ఈ ట్వీట్‌ను కోట్ చేస్తూ పూనమ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. “మరి అతను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. అదేం సమస్య కాదు కదా” అని పూనమ్ కామెంట్ చేసింది. వైసీపీ నాయకులు సంబంధం లేకుండా ప్రతిసారీ పవన్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని తెరమీదకి తెస్తుంటారు. ఏపీలో సమస్యల గురించి మాట్లాడితే.. పవన్ పెళ్ళిళ్ళ మీద విమర్శలు చేస్తారు. ఏపీ సీఎం జగన్ సహా అందరూ చేసేది ఇదే. ఈ నేపథ్యంలోనే పూనమ్ సెటైరిగ్గా ఈ ట్వీట్ పెట్టడం చర్చనీయాంశం అయింది.
This post was last modified on April 12, 2024 4:06 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…