Movie News

హరీష్ శంకర్ టచ్ ఇస్తే అంతే..

కొందరు దర్శకుల చేతిలో పడితే హీరోయిన్ల రాత మారిపోతుందని ఒక నమ్మకం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో. ఒకప్పుడు రాఘవేంద్రరావుకు ఇలాంటి పేరే ఉండేది. శ్రీదేవి సహా ఎందరో స్టార్ హీరోయిన్ల రాత మార్చారాయన. హీరోయిన్లను అందంగా, ఆకర్షణీయంగా చూపించి వాళ్ల కెరీర్‌కు ఊపు తెస్తారని ఆయనకు పేరుండేది. కొత్త తరంలో ఇలాంటి పేరున్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు.

‘గబ్బర్ సింగ్’కు ముందు వరకు ‘ఐరెన్ లెగ్’ అని పేరున్న శ్రుతి హాసన్‌.. ఈ సినిమా తర్వాత ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో పూజ హెగ్డే రాత మార్చేశాడు హరీష్. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. పూజా టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ పుణ్యమా అని ఇంకో హీరోయిన్‌ దశ తిరిగినట్లు కనిపిస్తోంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు బ్రేక్ ఇచ్చి రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ చిత్రంతో ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సేకు ఛాన్స్ ఇచ్చాడు హరీష్. మోడల్‌ టర్న్డ్ హీరోయిన్ అయిన భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ మేకింగ్ టైంలోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆల్రెడీ ఆమెను విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోయే సినిమాకు కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంతలోనే మరో మంచి ఛాన్స్ పట్టేసిందట భాగ్యశ్రీ. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘సాహో’ దర్శకుడు సుజీత్ రూపొందించబోయే చిత్రంలో కూడా ఆమే హీరోయిన్ అట. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ చిత్రానికి భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లే అంటున్నారు. తొలి సినిమా రిలీజ్ కాకముందే రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. చూస్తుంటే టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగేలా కనిపిస్తోంది భాగ్యశ్రీ.

This post was last modified on April 12, 2024 3:54 pm

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

1 hour ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

3 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

4 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

4 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

5 hours ago