ఒకప్పుడు తమిళ టాప్ హీరో విజయ్‌ను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. తమిళంలో చిన్న హీరోల సినిమాలు కూడా తెలుగులో మంచి స్పందన తెచ్చుకునేవి. కానీ విజయ్ సినిమాలు అసలిక్కడ రిలీజయ్యేవే కావు. కానీ ‘తుపాకి’ తర్వాత కథ మారింది. గత పదేళ్లలో అతను తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అదిరింది, బిగిల్, మాస్టర్, లియో చిత్రాలకు ఇక్కడ మంచి స్పందన వచ్చింది.
‘లియో’కైతే తెలుగులో మిడ్ రేంజ్ హీరోల సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు విజయ్ చేస్తున్న, చేయబోయే సినిమాల మీద మన వాళ్లలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తున్న విజయ్.. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
దీని తర్వాత మరో సినిమా చేసి.. రాజకీయాల్లోకి వెళ్తానని విజయ్ ప్రకటించడంతో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మీద ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ముందు ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత మనసు మార్చుకుని అంతకంటే నాలుగు నెలల ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబరు 5నే ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ రిలీజవుతుందని ఈ రోజు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో కథానాయికగా వడివడి అడుగులు వేస్తున్న మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో విజయ్ సరసన నటించడం విశేషం.
విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీ ఆధారంగా వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయ్‌తో మాస్టర్ మూవీ తీసిన నిర్మాతలే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on April 12, 2024 9:47 am
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…