కొన్నేళ్లు వెనక్కి వెళ్తే.. సిద్ధు జొన్నలగడ్డ అనే హీరో ముఖం పరిచయం ఉన్నా తన పేరు అది అని కూడా చాలామందికి తెలియదు. అప్పటికే ‘గుంటూరు టాకీస్’ సహా చాలా సినిమాలు చేసినా.. తనకు వచ్చిన గుర్తింపు తక్కువే. కానీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాతో అతను వేసిన ముద్ర బలమైంది. నటుడిగా, రచయితగా అతడి అసలు టాలెంట్ ఏంటో ఆ సినిమాతోనే చాలామందికి తెలిసింది.
ఐతే ఆ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో సిద్ధుకు ఒక మార్కెట్ అంటూ ఏమీ క్రియేట్ కాలేదు. థియేటర్లలో సినిమా హిట్టవడమే ఏ నటుడైనా కోరుకునేది. ఆ కోరికను ‘డీజే టిల్లు’ తీరుస్తుందని సిద్ధు ఆశించాడు. కానీ ఈ చిత్రం థియేటర్లలో జస్ట్ హిట్ కావడం కాదు.. బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందని.. ఆ సినిమా పాటలు, డైలాగులు అంతగా వైరల్ అవుతాయని సిద్ధు సైతం ఊహించి ఉండడేమో.
‘డీజే టిల్లు’తో వచ్చిన గుర్తింపుతో వచ్చిన అవకాశమల్లా వాడేసుకోకుండా ‘డీజే టిల్లు’ సీక్వెల్ చేయాలనుకోవడం సిద్ధు తీసుకున్న మంచి నిర్ణయం. దాని ఫలితం ఈ రోజు తెలుస్తోంది. ‘టిల్లు స్క్వేర్’పై జనాల్లో క్రేజ్ మామూలుగా లేదని అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అర్థమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోస్ ప్యాక్డ్ హౌస్‌లతో నడిచాయీ రోజు. హైదరాబాద్‌లో అయితే ఉదయం 7-7.30కే పలు థియేటర్లలో షోలు పడగా అవి అడ్వాన్స్ ఫుల్స్ అయ్యాయి.
ఈ షోల నుంచే కాక ఓవర్సీస్ ప్రిమియర్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో మార్నింగ్ షోలకు టికెట్లు దొరకడం కష్టమైపోయింది. సాయంత్రానికి మెజారిటీ థియేటర్లలో హౌస్ ఫుల్స్ బోర్డులు పెట్టడం గ్యారెంటీ. మొత్తానికి టిల్లు అనే పాత్రతో సిద్ధు దశ తిరిగినట్లే కనిపిస్తోంది. ‘డీజే టిల్లు’కు ముందు అతడికి స్టార్ ఇమేజ్ లేదు. కానీ ‘టిల్లు స్క్వేర్’ రన్ పూర్తయ్యేసరికి అతను నాని, విజయ్ దేవరకొండ, రామ్ లాంటి మిడ్ రేంజ్ స్టార్లున్న లీగ్‌లో అడుడు పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on March 29, 2024 8:36 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…