రామ్ చరణ్, మంచు మనోజ్ మధ్య మంచి స్నేహం ఉందనేది ఇద్దరి అభిమానులకు తెలిసిన విషయమే. అయితే అది ఎంత ఘాడంగా అనేది బయట పెట్టుకున్న సందర్భాలు తక్కువ. రీ ఎంట్రీ ఇవ్వక ముందు మనోజ్ అహం బ్రహ్మాస్మికి చరణ్ గెస్టుగా రావడం ఆ ప్రాజెక్టుని జనాల దృష్టిలో పడేలా చేసింది. తర్వాత అది ఆగిపోవడం వేరే విషయం. ముందు నుంచి ఆ బాండింగ్ ఇలాగే ఉంటూ వస్తోంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన చరణ్ పుట్టినరోజు వేడుకలకు గెస్టుగా వచ్చిన మనోజ్ తనకు మాత్రమే తెలిసిన ఒక ప్రత్యేక సంఘటనను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.
2018లో ఒక తెలుగు కుటుంబం దుబాయ్ లో అనుకోని పరిస్థితుల వల్ల చిక్కుల్లో ఇరుక్కుని పాస్ పోర్ట్, వీసా చేతిలో లేక ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనోజ్ కు కాల్ వచ్చింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆ ఫ్యామిలీని ఆదుకోవాలంటే డబ్బు సహాయం అవసరం కావడంతో తనకు చేతనయ్యింది అప్పటికే చేసినా ఇంకో 5 లక్షలు అవసరమయ్యాయి. క్లోజ్ ఫ్రెండ్ ని అడిగాలని భావించి అర్ధరాత్రి అని చూసుకోకుండా చరణ్ కు ఫోన్ చేశాడు. విషయం విన్న చరణ్ వెంటనే అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఒకే నిమిషంలో సొమ్ముని పంపించడంతో బాధితులు బయట పడ్డారు.
ఇది చరణ్ గొప్పతనమని మనోజ్ చెప్పినప్పుడు కరతాళధ్వనులు మిన్నంటాయి. ఇంత ఫ్రెండ్ షిప్ వీళ్ళ మధ్య ఉందని తెలిసింది ఇప్పుడే కావడంతో అక్కడికి వచ్చిన ఇతర అతిథులు ఆశ్చర్యపోయారు. నిజానికి మంచు మనోజ్ ముందు అనుకున్న గెస్టు లిస్టులో లేడట. వేరే కమిట్ మెంట్స్ వల్ల రాలేనని చెప్పినా తర్వాత చరణ్ కోసం వచ్చినట్టు తెలిసింది. సాయి దుర్గ తేజ్ ఏవో కారణాల వల్ల హాజరు కాలేకపోయాడు. అసలు వ్యక్తి రామ్ చరణ్ లేకుండానే ఇంత ఈవెంట్ జరిపినప్పటికీ ఫ్యాన్స్ కి కావాల్సిన అప్డేట్స్, స్పీచులతో హాజరైన వాళ్ళు విజయవంతంగా పూర్తి చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates