తీవ్ర వివాదాస్పదమైన విజయవాడ వెస్ట్ సీటును ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. బీజేపీ తన పంతమే నెగ్గించుకుంది. ఈ సీటును జనసేనకు కేటాయిస్తామని ముందు చెప్పిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకి ఇచ్చేశారు. దీంతో ఈ సీటును ప్రముఖ పారిశ్రామిక వేత్త, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కేటాయించారు. కానీ, ఇక్కడ జనసేన అభ్యర్థిగా బరిలో దిగాల్సిన పోతిన మహేష్ ఇప్పటికీ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక, బీజేపీ తాజాగా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో సీనియర్లలో చాలా తక్కువ మందికే అవకాశం లభించింది.
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ఆపార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కూటమిలో బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. మరో సీటు కోసం చర్చలు జరుగుతున్నాయి. దీనిని జనసేన ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలిసింది. ఇక, గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులపై కసరత్తు చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
ఇదీ.. 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల బీజేపీ జాబితా
ధర్మవరం- సత్యకుమార్
ఎచ్చెర్ల – ఈశ్వరరావు
విశాఖ నార్త్- విష్ణుకుమార్ రాజు
అనపర్తి- శివకృష్ణరాజు
విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి(టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు)
కైకలూరు – కామినేని శ్రీనివాస్
బద్వేల్ – బొజ్జా రోశన్న(ఎస్సీ)
జమ్మలమడుగు: ఆదినారాయణరెడ్డి(టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు)
ఆదోని – పార్థసారథి
అరకు వ్యాలీ – రాజారావు(ఎస్టీ)
Gulte Telugu Telugu Political and Movie News Updates