Movie News

దేవదాసు దర్శకుడితో నందమూరి కొత్త హీరో

స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్ళతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందు వరసలో ఉంటే నటన పరంగా కీర్తిశేషులు హరికృష్ణ తనదైన ముద్రవేయగలిగారు. చైతన్య కృష్ణ ఈ మధ్యే బ్రీత్ అంటూ ఏదో ప్రయత్నం చేశాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన జానకి రామ్ కుటుంబం నుంచి ఆయన పెద్దబ్బాయి తారకరామారావుని పరిచయం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని లేటెస్ట్ అప్డేట్. అన్నగారి బొమ్మతోనే తన బ్యానర్ బొమ్మరిల్లుని మొదలుపెట్టిన వైవిఎస్ చౌదరి ఈ బాధ్యతలు తీసుకున్నారట

వైవిఎస్ చౌదరి ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా దేవదాసు రూపంలో డెబ్యూ హీరో రామ్ కి సిల్వర్ జూబ్లీ హిట్ ఇచ్చిన దర్శకుడిగా అప్పట్లో పేరు మారుమ్రోగిపోయింది. నటించడం తగ్గించేసిన హరికృష్ణని హీరోగా పెట్టి లాహిరి లాహిరి లాహిరి లాహిరి, సీతయ్యతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకోవడం అభిమానులకు గుర్తే. ఆ తర్వాత చౌదరి ఫామ్ కోల్పోయారు. సాయి తేజ్ రేయ్, రవితేజ నిప్పు లాంటివి భారీ డిజాస్టర్లు కావడంతో దర్శకత్వానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత జానకిరామ్ అబ్బాయిని పరిచయం చేయడం కోసం ఒక యూత్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్టు సమాచారం.

అందరూ కొత్తవాళ్లతో వైవిఎస్ చౌదరి తన మొదటి సినిమా శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండితోనే మంచి విజయం అందుకున్నారు. సో ఇప్పుడు ఇదేమి రిస్క్ కాదు. కాకపోతే మారిపోయిన ట్రెండ్, అభిరుచులకు అనుగుణంగా  ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. జానకిరామ్ పెద్దబ్బాయి పేరు తారకరామారావు. ఆల్రెడీ ఆ పేరుతో తారక్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా మార్పుతో పరిచయం చేస్తారేమో చూడాలి. అధికారికంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. అన్నీ ఓకే అనుకున్న తర్వాత అఫీషియల్ గా లాంచ్ గురించి చెప్పబోతున్నారు. 

This post was last modified on March 26, 2024 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

3 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

4 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

5 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

6 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

6 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

6 hours ago