మే 9 విడుదలలో మార్పు ఉన్నది లేనిది ఇంకా ప్రొడక్షన్ హౌస్ వెల్లడించడం లేదు కానీ కల్కి 2898 ఏడి రిలీజ్ లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి ఛేంజ్ లేదు. ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉన్న నేపథ్యంలో జనాల మూడ్ సినిమాల మీద అంతగా లేదని నెల రోజులలుగా కొత్త చిత్రాల వసూళ్లు చూస్తే అర్థమవుతుంది. అందుకే రిస్క్ తీసుకోవడం కన్నా ఇంకో డేట్ కి వాయిదా వేసుకోవడం మేలనే అభిప్రాయం వైజయంతి టీమ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్యాన్ ఇండియా మూవీ లో కమల్ హాసన్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆయన క్యారెక్టర్ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న మూవీ లవర్స్ కు షాక్ ఇస్తూ కమల్ హాసన్ కేవలం ఇందులో అతిథిగా నటించానని, దానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని ఒక ప్రముఖ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. కొన్ని నెలల క్రితం వచ్చిన లీక్ లో కమల్ చివరిలో కేవలం ఒక పావు గంట కంటే తక్కువ నిడివిలో కనిపిస్తారని వినిపించింది. దానికి బలం చేకూర్చేలా ఆయనే స్వయంగా కుండబద్దలు కొట్టేయడంతో కమల్, ప్రభాస్ మీద ఎక్కువ ఎపిసోడ్లు ఉంటాయని ఊహించుకోకపోవడమే మంచిదని చెప్పాలి.
క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు మాత్రం కమల్ చెప్పలేదు. నెగటివ్ షేడ్ ఉంటుందనేది మాత్రం అనఫీషియల్ న్యూస్. ప్రస్తుతం దర్శకుడు నాగ అశ్విన్ నేతృత్వంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కల్కి టీమ్ బ్యాలన్స్ ఉన్న ప్యాచ్ వర్క్ తదితరాలను ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తి చేయాలని చూస్తోంది. అయితే విఎఫెక్స్ కు ఎక్కువ టైం పడుతున్నందున మే 9 రిలీజ్ సాధ్యాసాధ్యాల గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని యూనిట్ ఆఫ్ ది రికార్డ్ అంటున్న మాట. ఏదైతేనేం ఒక ముఖ్యమైన అప్డేట్ కమల్ హాసన్ రూపంలో ఆయన నోటి వెంటే వచ్చేసింది. డౌట్ తీరిపోయింది.
This post was last modified on March 25, 2024 10:54 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…